సావిత్రికి జెమినీ గ‌ణేశ‌న్ దొరికేశాడు

అల‌నాటి క‌థానాయిక సావిత్రి జీవిత క‌థ‌ని వెండి తెర‌పై ‘మ‌హాన‌టి’ పేరుతో ఆవిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌బోతోంది. స‌మంత‌కు ఓ ప్ర‌ధాన పాత్ర ద‌క్కింది. ఈ టీమ్ లో అనుష్క కూడా చేర‌బోతోంద‌ని స‌మాచారం. ఇప్పుడు మ‌రో న‌టుడు ‘మ‌హాన‌టి’ టీమ్ లో చేరాడు. త‌నే దుల్క‌ర్ స‌ల్మాన్‌. మ‌ణిర‌త్నం ఓకే బంగారంతో తెలుగులోనూ పాపుల‌ర్ అయ్యాడు దుల్క‌ర్‌. జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ పాత్ర కోసం సూర్య‌ని ట్రై చేశారు. కానీ తాను సున్నితంగా తిర‌స్క‌రించ‌డంతో.. దుల్క‌ర్ రేసులోకి వ‌చ్చాడు. ఇటీవ‌ల అశ్వ‌నీద‌త్ దుల్క‌ర్ స‌ల్మాన్‌ని క‌ల‌సి క‌థ‌, త‌న పాత్ర వివ‌రించార్ట‌. జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర తీరుతెన్నులు న‌చ్చి దుల్క‌ర్ మ‌రో మాట లేకుండా.. ‘ఓకే’ అనేశాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close