సమంత‌కు బీటు కొడుతున్న కుర్ర హీరో!

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్కుతోంది. అదే… `మ‌హాన‌టి`. అల‌నాటి అపురూప న‌టీమ‌ణి `సావిత్రి` జీవిత క‌థ ఇది. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ భారీ క‌స‌ర‌త్తే చేశాడు. మ‌హాన‌టి జీవితంలోని కొన్ని అపురూప‌, అరుదైన ఘ‌ట్టాల్ని క్షుణ్ణంగా స్ట‌డీ చేసి.. క‌థ‌గా మ‌లుచుకొన్నాడు. ఇప్పుడు పాత్ర‌ధారుల ఎంపిక‌తో.. ఈ సినిమాకి. సావిత్రి క‌థ‌కు కొత్త గ్లామ‌ర్ అద్దే ప‌నిలో ప‌డ్డాడు. సావిత్రి పాత్ర‌కు క్రేజీ క‌థానాయిక కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకొన్నాడు. స‌మంత‌కీ ఓ కీ రోల్ ద‌క్కింది. జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌కు స‌ల్మాన్ దుల్క‌ర్‌ని ఎంపిక చేసుకొన్నారు. ఇప్పుడు ఓ కుర్ర హీరోకి ఈ టీమ్ లో చోటు ద‌క్కింది. త‌నే… `పెళ్లి చూపులు` హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో విజ‌య్‌కి తొలి బ్రేక్‌దొరికింది. ఆ సినిమా తీసింది నాగ అశ్వినే. ఆ అనుబంధంతోనే ఈ పాత్ర‌కి ఓకే చెప్పాడ‌ట విజ‌య్‌. త‌న‌దేం చిన్నా చిత‌కా పాత్ర కాదు. స‌మంత‌కు బీట్ కొట్టే క్యారెక్ట‌ర్‌. ఈసినిమాలో స‌మంత ఓ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌న వెంట ప‌డి… ప్రేమించే అబ్బాయి పాత్ర‌లో విజ‌య్ న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్ పాత్ర‌ల కోసం ప్ర‌స్తుతం క‌స‌రత్తు జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఏయే పాత్ర‌లు ఎవ‌రెవ‌రు చేస్తార‌న్న‌దానిపై ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.