అస‌లు కార‌ణం అధికారుల బ‌దిలీల‌ని ఎందుకు గుర్తించ‌డం లేదు..?

ఏపీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. అయితే, రాజ‌కీయంగా ఇంత తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతున్నా, దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ఇంత‌వ‌ర‌కూ సీఈవో ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఇంత‌కీ ఏపీలో న‌ష్టం జ‌రిగిందా, జ‌రిగితే ఏ మేర‌కు జ‌రిగింది, దానికి ఎవ‌రు బాధ్య‌తులు వ‌హించాలి… ఇలాంటి అంశాలపై అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా సీఈవో ద్వివేదీ మాట్లాడిన సంద‌ర్భం లేదు. పైపెచ్చు, ఇప్పుడు వినిపిస్తున్న‌ది ఏంటంటే… ఏపీలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో పాల్గొన్న అధికారుల తీరుపై ద్వివేదీ అసంతృప్తిగా ఉన్నారట‌! క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది ఫెయిలైతే, విమ‌ర్శ‌ల‌న్నీ తానొక్క‌డినే భ‌రించాలా అనే త‌ర‌హాలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాను రాష్ట్రస్థాయి అధికారిని మాత్ర‌మేన‌నీ, త‌న ప‌రిమితులు ఇంతే అంటూ ఈ మొత్తం చ‌ర్చ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకునే విధంగా ఆయ‌న తీరు ఉంటోందని స‌మాచారం. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం త‌న మాట విన‌లేద‌నీ, అటు జాతీయ స్థాయి నుంచి కూడా ఇదే ప‌రిస్థితి అనే ధోర‌ణిలోకి నెమ్మ‌దిగా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు తీరిగ్గా క‌లెక్ట‌ర్ల నుంచి నివేదిక‌లు తెప్పించుకుని చ‌ర్య‌లు అంటున్నారు.

ఇంత‌కీ, అసలు స‌మ‌స్య ఎక్క‌డ త‌లెత్తింది..? దీనంత‌టికీ మూల కార‌ణం ఎక్క‌డుంది..? ఎన్నిక‌ల ముందు ఇష్టానుసారంగా ఉన్న‌ప‌ళంగా ఉన్న‌తాధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం ద‌గ్గ‌ర అస‌లు లోపం ఉంది! ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నిక‌ల సమ‌యంలో బ‌దిలీ చేశారు. దానికి సరైన కార‌ణ‌మంటూ చెప్ప‌లేదు. ఏదో ఒక రాజ‌కీయ పార్టీ ఫిర్యాదు చెయ్య‌గానే ఫిర్యాదుల‌కు, దాన్నే ప‌రి‌గ‌ణ‌న‌లోకి తీసుకుని చ‌ర్య‌ల‌కు దిగేశారు. డీజీపీ మీద ఆంక్ష‌లు పెట్టి, ఆయ‌న్ని క‌ద‌ల‌నీయ‌కుండా చేశారు. వ్యవస్థ‌లో కీల‌క‌మైన చీఫ్ సెక్ర‌ట‌రీ, డీపీజీల విష‌యంలోనే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే.. వీళ్ల కింద‌నున్న ఇత‌ర విభాగాల‌న్నీ క్రియాశీలంగా ప‌నిచేయ‌లేద‌న్న‌ట్టు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమ‌నుకోవాలి..? ఛీఫ్ సెక్ర‌ట‌రీ, డీజీ ఇంటెలిజెన్స్‌, ప్ర‌కాశం జిల్లా ఎస్పీ, క‌డ‌ప ఎస్పీ, క‌లెక్ట‌ర్లు, ఇంకొంద‌రు అధికారులు… ఈసీకి అధికారం ఉంద‌ని ఇలా అంద‌ర్నీ మార్చే ప‌డేశారు. ఆయా అధికారుల నుంచి క‌నీసం వివ‌ర‌ణ కూడా తీసుకోలేదు.

సి.ఎస్‌.నే మార్చేసిన త‌రువాత‌, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేష‌న్ త‌మ‌కు స‌హ‌క‌రించ‌లేదూ, ఇప్పుడు వారిమీద నివేదికలు తెప్పించుకుని చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆవేద‌న చెందితే ఏం ఉప‌యోగం..? సి.ఎస్.ని మారుస్తున్న ఈసీవో అభిప్రాయం తీసుకునే నిర్ణ‌యం తీసుకుంటారు క‌దా? క‌నీసం అప్పుడైనా… ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న్ని మారిస్తే అడ్మినిస్ట్రేష‌న్ దెబ్బ‌తింటుంది, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఇబ్బందిక‌రంగా మారుతుంది, స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఈసీవో చెప్ప‌లేక‌పోయారా..? ఈ మొత్తం వ్య‌వ‌హారానికి కార‌ణం ముమ్మాటికీ అధికారుల బదిలీలే. దాని సైడ్ ఎఫ‌క్ట్స్ ఇవ‌న్నీ. దాన్ని కార‌ణంగా గుర్తించ‌రు! కానీ, ఇప్పుడు క‌లెక్ట‌ర్ల నుంచి, అధికారుల నుంచి నివేదిక‌లు తీసుకుంటామంటున్నారు. ఈవీఎంల మొరాయింపులు, ఆల‌స్యంగా ఓటింగ్ ప్ర‌క్రియ‌, స‌రైన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు లేక‌పోవ‌డం… వీట‌న్నింటికీ ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్టు..? అధికారుల నుంచి స‌హాకా‌రం అంద‌లేద‌ని సీఈవో చెప్పేసి చేతులు దులుపుకుంటే స‌రిపోతుందా..? అయినా, ఎన్నిక‌ల కోడ్ అంటూ వ‌చ్చాక రాష్ట్రంలో ఆయ‌నే క‌దా స‌ర్వాధికారి! ఆయ‌న కింద ఉన్న వ్య‌వ‌స్థ‌లు ఫెయిల‌య్యాన‌ని చెప్తే… ఎవ‌రు ఫెయిలైన‌ట్టు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close