సుజనాకు ఈడీ కష్టాలు..! బీజేపీ వదిలించుకోవాలనుకుంటోందా..?

ఎంపీ సుజనా చౌదరికి మళ్లీ ఈడీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుజనా చౌదరి షెల్‌ కంపెనీలను పెట్టి రుణాల పేరుతో బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర…మోసం చేశారని ఈడీ అభియోగాలు నమోదు చేసిసింది. సుజనాచౌదరిపై ఇప్పటికే సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.71 కోట్లు.. కార్పొరేషన్‌ బ్యాంక్‌కు రూ.159 కోట్లు మోసం చేసినట్టు అందులో పేర్కొంది. అయితే ఈ మూడు కలిపినా వెయ్యి కోట్లు కావు. కానీ ఈడీ కేసుల్లో మాత్రం ఏకంగా రూ. 5,700 కోట్లను చూపిస్తున్నాయి. దీంతో ఆయన చేసిన స్కాం చిన్నది కాదని అర్థమవుతోందంటున్నారు.

సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అధినేతకు ఒకప్పుడు… రైట్ హ్యాండ్ లా ఉండేవారు. అది గత ఎన్నికల ముందు వరకు. ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పొందగానే.. ఆయన బీజేపీలోకి జంపయ్యారు. అప్పట్నుంచి ఆయన కరుడుగట్టిన హిందూ వాదిగా ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన బీజేపీ పెద్దలతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కూడా ఆయనకు సీబీఐ చిక్కులు వచ్చాయి. మంత్ర ిపదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనను సీబీఐ పలుమార్లు విచారణకు పిలిచింది. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు కాస్త రిలీఫ్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి తిరగబడుతోంది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది.

తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. సుజనా చౌదరి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆయనది పరోక్ష రాజకీయమే. ఆయన వల్ల బీజేపీకి పైసా ప్రయోజనం ఉండదు. అయినప్పటికీ.. టీడీపీ ఇచ్చిన రాజ్యసభ సీటు ఆయనకు ఉందికాబట్టి ఆకర్షించి మరీ పార్టీలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం… ఆయన బీజేపీకి భారమయినట్లుగా కనిపిస్తోంది. అందుకే… ఆయనపై ఈడీ కేసులు ప్రయోగిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే.. సీబీఐ, ఈడీ ఎదైనా కానీ… ఇతరుల సంగతేమో కానీ.. భారతీయ జనతా పార్టీ నేతల విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకమైన ఆదేశాలు ఉంటే తప్ప ముందడుగు వేయరన్న ప్రచారం ఉంది. అందుకే.. సుజనాపై ఈడీ కేసులను.. విచారణను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదంటున్నారు. అయితే్ సుజనా మాత్రం బీజేపీ విషయంలో తన చిత్తశుద్దిని బాగానే నిరూపించుకుంటున్నారు. రామాలయానికి రెండున్నర కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close