ఎడిటర్స్‌ కామెంట్ : వైసీపీ గురివింద రాజకీయం..!

గురివింద రాజకీయం అంటే ఏమిటో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పార్టీ అధినేతకు.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా…. సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు కోసం.. జగన్ ఎంపీలందర్నీ ఢిల్లీకి పంపుతున్నారు. కానీ టీడీపీ నుంచి చేర్చుకుని ఆ పార్టీ అధినేత… ఆ పార్టీని అసభ్యంగా తిట్టిస్తున్న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను మాత్రం.. మురిపెంగా చూసుకుంటున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేస్తానంటూ.. పెద్ద పెద్దమాటలు ఆయన ఇప్పటికీ చెబుతూంటారు. ఓ వైపు ఆయన చేసే పనులు.. కక్ష సాధింపు రాజకీయాలు.. నిర్ణయాలను ప్రశ్నించిన వారిపై కేసులు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారాలను కూల్చేస్తామని.. ఆర్థికంగా కుంగదీస్తామని బెదిరించి పార్టీలో చేర్చుకోవడాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఎప్పుడూ ఒకే కాలం ఉండదు. కానీ ఎవరికైనా రివర్స్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. అధికార పార్టీ అధినేత విషయంలో మాత్రం ఇది చాలా త్వరగా రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. బహుశా… జగన్ చెప్పినట్లు.. దేవుడి స్క్రిప్ట్ అలా రాశారని అనుకోవాలేమో..?

రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటే లక్ష్యం..!

శివ సినిమాలో ఓ సూపర్ హిట్ డైలాగ్ ఉంటుంది. విలన్ రఘువరన్.. శివ దెబ్బకు తట్టుకోలేక..” శివ.. శివ.. శివ.. ఎవడ్రా వాడు.. వెళ్లి నాలుగు లారీలు మనుషుల్ని తీసుకెళ్లి నరికి పారేయండి..” అని షార్ట్ టెంపర్‌తో ఆర్డరేస్తాడు. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న విలన్ భవానికి.. ఆ శివ ఎంత చిరాకు తెప్పించి ఉంటాడో.. ఆ ఒక్క డైలాగ్‌తో తేలిపోతుంది. అచ్చంగా.. అలాంటి డైలాగే.. తాడేపల్లిలో గురువారం వినిపించినట్లుగా ఉంది. రఘురామకృష్ణంరాజు చేస్తున్న రచ్చతో ఆయనపై వేటు కోసం.. అదే టెంపోతో… ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న వారికి జగన్ ఆదేశాలిచ్చినట్లుగా ఉన్నారు. పోలోమంటూ ప్రత్యేక విమానం మాట్లాడేసుకుని రఘురామకృష్ణంరాజు మీద.. అనర్హతా వేటు వేయించేస్తామంటూ ఢిల్లీకి వెళ్తున్నారు. నిజానికి అనర్హతా వేటు వేయాలంటే.. మిగిలిన ఎంపీలందరూ.. ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. స్పీకర్ ముందు పరేడ్ చేయాల్సిన అవసరం లేదు. మెజార్టీ ఎంపీలు.. ఓటింగ్ చేసి.. రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని.. ఏకగ్రీవ తీర్మానం చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. అలాంటి ప్రక్రియ ఏదీ.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో లేదు. ఆ విషయం… ఎంపీల్ని ఢిల్లీకి తీసుకెళ్తున్న వారికి.. అలా తీసుకెళ్లమని ఆదేశించిన వారికి తెలియక కాదు. తెలిసినా తాము చేసిందే కరెక్ట్ అని అనుకోవడం వల్లనే సమస్య వస్తోంది.

వైసీపీ అధినేత తెలివికి తగ్గట్లుగానే ఆర్ఆర్ఆర్ రాజకీయం..!

శరద్ యాదవ్ విషయంలో.. అలా జరిగిందంటూ… ఓ కొత్త ప్రక్రియను పట్టుకుని ఈ వ్యవహాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బీహార్‌కు చెందిన జేడీయూలో శరద్ యాదవ్ కీలక నేత. ఆర్జేడీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో చేతులు కలపాలనుకున్న నితీష్ కుమార్ నిర్ణయాన్ని శరద్ యాదవ్ ఒప్పుకోలేదు. దాంతో ఆయనతో పాటు .. మరో ఎంపీపై.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ.. 10 మంది ఎంపీల్లో ఏడుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి అనర్హతా పిటిషన్ సమర్పించారు. శరద్ యాదవ్ ఆ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్షాల కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా.. ఎంపీ ఇచ్చే వివరణను బట్టి విచక్షతను ఉపయోగించి రాజ్యసభ చైర్మన్‌ అనర్హత వేటు వేస్తారు. కానీ ఆ సమయంలో వెంకయ్య నాయుడు ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఏడుగురు ఎంపీల పిటిషన్‌, ఇద్దరు ఎంపీల వివరణను రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ అధ్యయనానికి పంపించారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయం ప్రకారం.. వేటు వేశారు. అంటే ఇక్కడ వేటు వేశారు అనే నిందను.. వెంకయ్యనాయుడు తప్పించుకున్నారు. అదే పద్దతిలో ఇప్పుడు.. వైసీపీకి ఉన్న ఎంపీలందర్నీ స్పీకర్ ముందుకు తీసుకెళ్లి రఘురామకృష్ణంరాజుపై అనర్హతా పిటిషన్ వేస్తామని వైసీపీ నేతలు బయలుదేరారు. దీని కోసం ప్రత్యేక విమానం మాట్లాడుకున్నారు. ఇంత వరకూ బాగానే రఘురామకృష్ణం రాజు.. పార్టీ అధినేత గురించి కానీ.. పార్టీ గురించి కానీ.. ఒక్క మాట కూడా.. వ్యతేరికంగా మాట్లాడలేదని వాదిస్తున్నారు.

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు..?

శరద్ యాదవ్‌పై అనర్హతా వేటు అయినా… గత ఎన్నికలకు ముందు వైసీపీ ఎంపీలు.., ప్రత్యేక హోదా కోసం చేసిన రాజీనామాలు… ఉపఎన్నికలు రాకుండా ఆమోదం పొందేలా స్పీకర్ సహకరించడానికైనా… కేంద్రంలో అధికార పెద్దల అండ ఉండి తీరాలి. ఇక్కడ ఆ అండ.. రఘురామకృష్ణంరాజుకు ఉందా.. వైసీపీ అగ్రనాయకత్వానికి ఉందా అన్నది తర్వాత తేలుకుంది. అయితే.. వైసీపీ ఇక్కడ రఘురామకృష్ణంరాజుపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఆయనపై అనర్హతా వేటు వేయించేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. కానీ.. ఆయన పార్టీ అధినేతను .. పార్టీని ఏమీ అనడం లేదు. అదే సమయంలో.. పార్టీ అధినేతను.. అసభ్యంగా తిడుతూ.. తాము ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అధికారికంగా కండువాలు కప్పుకోకపోవచ్చు.. కానీ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారిక సమావేశాల్లో పాలు పంచుకుంటున్నారు. అంటే వారు వైసీపీలో కలిసిపోయినట్లే. వారిపై మాత్రం.. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ తరపున ఎన్నికై.. తమ విధానాలను వ్యతిరేకించారన్న కారణంగా… ఏకంగా ఎంపీపై వేటుకే… ప్రత్యేకం విమానంలో అందర్నీ ఢిల్లీ కి పంపుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తాను ఏం చేస్తున్నారు..?

తాను చేస్తే సంసారం.. రఘురామకృష్ణంరాజు చేస్తే వేరేనా..?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా చేరారు. వారెవరిపైనా ఇంత వరకూ వేటు వేయలేదు. పైగా.. ఇప్పటి వరకూ చెప్పిన ఆదర్శాలకు కొత్త అర్థాలు చెప్పుకుంటూ.. వారితోనే… వారు ఎన్నికైన పార్టీని.. అధినేతను విమర్శింప చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలని ఆరాట పడుతున్న పార్టీ అధ్యక్షుడు తాను చేస్తున్నది అదేకదా.. అని ఎందుకు అనుకోరు. ..? ఎన్నికల ప్రచారంలో.. అసెంబ్లీలో.. ఇప్పుడు కూడా.. రాజకీయ వ్యవస్థను మారుస్తానని నిస్సంకోచంగా.. తడుముకోకుండా.. చెబుతూ ఉంటారు. తాను చేసేది ఒప్పు.. ఇతరులు చేసేది మాత్రమే తప్పు అని ఎలా న్యాయం చెప్పుకుంటారు.. ?గురివిందకు తన నలుపు తెలియదన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాజకీయం ఉంది.

అసలు వైసీపీపైనే అనర్హతా వేటు వేయించేలా ఆర్ఆర్ఆర్ వ్యూహం..!

తాడిదన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటాడని… సామెతలు ఊరకనే పుట్టలేదు. తనపై అనర్హతా వేటు వేయించాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి.. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయించి షాక్ ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు.. చాలా తీవ్ర స్థాయిలోనే ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగ, న్యాయనిపుణులను ఎన్నికల చట్టాలను ఔపాసన పట్టిన వాళ్లను పట్టుకుని.. వైఎస్ఆర్ పార్టీ అని పిలుచుకోవడానికి ఈసీ అనుమతి ఇచ్చిన అన్న వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారిని ఎక్కడో ఉన్నా వెలుగులోకి తీసుకుని.. ఢిల్లీకి తీసుకెళ్లి రాజకీయం చేస్తున్నారు. నిబంధనలు ఎలా ఉన్నా… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలనుకుంటే..అది చేస్తుంది. ఒక వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటే.. ఈసీ వైసీపీని రద్దు చేయడం.. క్షణాల్లో పని. అదే జరిగితే.. ఏడ్చి గగ్గోలు పెట్టడం తప్ప… కిక్కురుమనలేని పరిస్థితి వైసీపీది. దానికి అవకాశం కూడా ఉంది. వైఎస్ఆర్ పేరును వాడుకోవద్దంటూ.. ఈసీ ఇప్పటికే పలుమార్లు.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేఖలు రాసిందని.. రఘురామకృష్ణంరాజే స్వయంగా వెల్లడించారు. అదే నిజమైతే.. ప్రత్యేకంగా ఈసీ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేకుండానే నిర్ణయాన్ని ప్రకటించేయవచ్చు. ఇప్పటికే.. ఈ విషయంలో అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు.. ఓ పిటిషన్ కూడా.. ఈసీ దగ్గర వేశారు. ప్రత్యేకంగా ఎవరో కల్పించుకోకపోతే.. వారు ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉండదు.

చట్టం..న్యాయం.. నియమాలు.. నైతికతకు సమస్త వైసీపీ అతీతం..!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా జరుగుతున్న రాజకీయం ఏమింటే.. నియమాలు.. నిబంధనలు.. చట్టాలు.. ఏవైనా కానీ… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి … ఆ పార్టీ అధినేతకు.. ఆ పార్టీ నేతలకు.. ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప.. అందరికీ వర్తిస్తాయి. వీటన్నింటికీ… అతీతులు అధికార పార్టీ వారు. అందుకే.. నడిరోడ్డుపై హత్యాయత్నాలు చేసినా వారికి స్టేషన్ బెయిళ్లు వస్తాయి. కానీ.. సోషల్ మీడియాలో చూశానంటూ.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. టీడీపీ కీలక నాయకులపై నిర్భయ కేసులు కూడా పెడతారు. కోర్టులపై కూడా… నిందలేస్తారు. కానీ ఎవర్నీ ఏమీ అనకూడదు.. అనలేరు కూడా. రాజకీయమూ అంతే.. తాను ఇతర పార్టీల నుంచి … సామ, బేద, దాన దండోపాయాలను ప్రయోగించి.. నేతల్ని చేర్చుకుని వారి విషయంలో మాత్రం… నిబంధనలకు కొత్త అర్థాలు చెప్పొచ్చు.. కానీ తమ పార్టీ వారు మాత్రం.. నిబంధనలకు అనుగుణంగా ప్రజా స్వామ్య పోరాటం చేసినా.. వారిపై అనర్హతా వేటు వేయాల్సిందే. లేకపోతే… ఆ నిర్ణయం తీసుకోని వాళ్లు ప్రజాస్వామ్య ద్రోహులవుతారు. లేకపోతే చంద్రబాబుతో కుమ్మక్కయిన వారవుతారు.

మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఇప్పుడు గురివింత సామెతనే గుర్తు చేస్తోంది. తమ నలుపును గుర్తించలేని అధికార పార్టీ…కొత్త తరహా రాజకీయంతో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆశ్చర్యపోవడం తప్ప… నయా ప్రజాస్వామ్య వాదులు.. ఓటర్లు… చేయగలిగిందేమీ లేదు. ఏమైనా అంటే.. ఇవన్నీ చేయడానికే.. తమకు ప్రజలు అధికారం కట్టబెట్టారని… అదీ కూడా.. 151 సీట్లు ఇచ్చారని వాదిస్తా

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close