రివ్యూ : ‘వీడు గోల్డ్ ఎహె’ కాదు బోర్ ఎహె

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5

మంచి హిట్ కోసం ఎంతగానో పరి తపిస్తున్న సునీల్. ఈమధ్యే ‘జక్కన్న’ అనే సినిమా కాస్త పరవా లేదనిపించినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ చాలా అవసరమున్న నేపథ్యంలోనే సక్సెస్ నిర్మాత అనిల్ సుంకర తన సొంత బ్యానర్ ఏ కె ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్., పతాకం పై వీరు పోట్ల దర్శకత్వం లో వచ్చిన ‘ఈడు గోల్డ్ ఎహే’ ఈ రోజు విడుదల అయ్యింది. మరి ఈడు గోల్డ్ ఎహే ఎంతమేరకు ఆకట్టుకుందీ? సునీల్ కి ఈ సారైనా హిట్ కొట్టాడా సమీక్ష లో చూద్దాం..

కథ :
తనకు నచ్చిన చోటల్లా పనిచేసుకుంటూ వెళ్ళే బంగార్రాజు (సునీల్) ఓ అనాథ. కానీ బంగార్రాజు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ యజమానికి ఎన్నో ఇబ్బందులు ఎదురైతాయి. అలాంటి పేరున్న బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ తన మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజును సునీల్ వర్మ అనుకుని వెంటాడు తుంటారు. ఒకానొక సమయం లో సమస్తం కోల్పోయిన బంగార్రాజు సునీల్ వర్మ ను వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న వైరం ఏమిటి ? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
హీరో సునీల్ ఎప్పట్లానే తనదైన స్టయిల్లో గత చిత్రాలలో లాగే నటించాడు. కామెడీ పంచ్‌లు పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా,తమ అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్ ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ లతో అందరు బాగా ఆకట్టుకున్నారు.పోసాని కృష్ణ మురళితో పాటు ఇతర కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ కావాలని సినిమా లో ఇరికించి ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టారు. విలన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

సాంకేతిక వర్గం:
దర్శకుడు వీరూ పోట్ల విషయానికి వస్తే, గతం చిత్రం దూసుకెళ్తా…వంటి కామెడీ థ్రిల్లర్‌ ని మరో సారి నమ్ముకున్నాడు. అతని మార్క్ కామెడీతో కూడా బాగానే ఆకట్టుకుంది కాకపోతే కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను పెట్టుకొని వాటితో చేయాల్సిన కథనం సరిగ్గా చేయలేకపోయాడనే చెప్పాలి. ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే ఏ మాత్రం బాగో లేదు. స్క్రీన్‌ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. అయితే కొన్ని ట్విస్ట్ లు సినిమా లో బాగానే డీల్ చేసాడు. సాగర్ మహతి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓ కె, పాటలు ఏ మాత్రం బాగో లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో లోపాలు కనిపిస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :
ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి సుదీర్ఘమైన అవసరం లేని సన్నివేశాలు మైనస్‌గానే చెప్పాలి. ఈడు గోల్డ్ ఎహేకి ప్లస్ పాయింట్ చిత్రం లోని ట్విస్ట్‌లనే చెప్పాలి. ఇంటర్వెల్‌ లో , ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఈ ట్విస్ట్‌లు అన్ని ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా బాగుంది. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. అదిరిపోయే బలమైన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి వి వున్నా, మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకో లేక పోయింది. మూడు, నాలుగు బలమైన ట్విస్ట్‌ల చుట్టూ అల్లిన కథను పక్కనబెడితే, కథ లో ఉండాల్సిన స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్. ఆ ట్విస్ట్‌లు వచ్చే సందర్భాలు వాటికి ముందు సీన్స్ తప్పితే మిగతా సినిమా అంతా బోరింగ్‌గా ఉంటుంది. చివరాఖరికి చెప్పాలంటే సునీల్ ఈ చిత్రం తో అతనికి ప్లస్ ఏమి లేదు. టైం పాస్ మూవీ గా ఈ చిత్రాన్ని చూడొచ్చు.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5
బ్యానర్ : ఏ కె ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్.,
నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్, జయసుధ,నరేష్, పునీత్ ఇస్సార్, అరవింద్ కృష్ణ, ప్రిథ్వి రాజ్, పోసాని కృష్ణ మురళి,వెన్నెల కిషోర్ ,షకలక శంకర్,ప్రభాస్ శ్రీను, చంద్ర దీప్, భరత్ తది తరులు..
సంగీతం : సాగర్ మహతి,
సమర్పణ : ఏ టి వి,
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వీరూ పోట్ల,
విడుదల తేదీ :07.10.2016.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]