మీడియా వాచ్ : ‘ఈనాడు’లో సెక్యురీటీ ర‌భ‌స‌

వేజ్ బోర్డు ప్ర‌భావంతో తల్ల‌డిల్లిపోయిన సంస్థ‌ల్లో `ఈనాడు` ప్రధ‌మ స్థానంలో ఉంటుంది. వేజ్ బోర్డు అప్ల‌య్ చేస్తే.. ఉద్యోగుల‌కు భారీ స్థాయిలో వేత‌నాలు పెంచాల్సివ‌స్తుంది. అందుకే…. ఈనాడుని `రామోజీ ఫిల్మ్‌సిటీ`కి షిఫ్ట్ చేసేశారు. అక్క‌డైతే.. `గ్రామం` కోటాలో సిబ్బందికి ఈస్థాయిలో వేత‌నాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అందుకే… హుటాహుటిన ఈనాడు సిబ్బంది మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీకి షిఫ్ట్ అయిపోయారు. అయినా వేజ్ బోర్డు భారం తీర‌లేదు. అందుకే చాలామందిని బ‌ల‌వంతంగా వాలెంట‌రీ రిటైర్‌మెంట్ లేఖ చేతిలో పెట్టేశారు. అందుకోసం.. భారీ ప్యాకేజీలు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌భావం సెక్యురీటీపై ప‌డింది. ఇప్పుడున్న సెక్యురీటీకి క‌నీసం నెల‌కు అర‌వై వేల జీతం చెల్లించాల్సివ‌చ్చింది. అందుకే… వాళ్ల‌కూ రిటైర్‌మెంట్ లేఖ‌లిచ్చేసి, థ‌ర్డ్ పార్టీ సెక్యురీటీ పేరిట‌.. వాళ్ల కోసం మ‌ళ్లీ కొత్త పోస్టులు సృష్టించి నెల జీతం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఫిక్స్ చేశారు. అంటే సెక్యురీటీ గార్డులు ఈనాడుకి రాజీనామా చేసి, మ‌ళ్లీ ఈనాడులోనే త‌క్కువ జీతానికి, అది కూడా కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన చేరార‌న్న‌మాట‌.

ఈ మ‌త‌ల‌బు గ్ర‌హించిన సెక్యురిటీ సిబ్బంది కోర్టుని ఆశ్ర‌యించారు. అయితే ఇలాంటి వ్య‌వ‌హారాల్లో ప‌క్కాగా ఉండే ఈనాడు… కోర్టులో గ‌ట్టిగా త‌న వాద‌న వినిపించింది. దాంతో సెక్యురీటీ గార్డులు వేసిన కేసు కొట్టివేశారు. త‌మ‌పై కోర్టుకెక్కిన సెక్యురిటీపై ఈనాడు సీరియెస్ అయ్యింది. దాంతో వాళ్లంద‌రి పోస్టులూ మ‌ళ్లీ ఊడాయి. జీతాలన్నీ సెటిల్ చేసి, అర్థాంత‌రంగా వాళ్ల‌ని ఉద్యోగాల నుంచి త‌ప్పించింది యాజ‌మాన్యం. రాత్రికి రాత్రే మ‌ళ్లీ కొత్త సిబ్బందిని నియ‌మించుకుంది. ఈ వ్య‌వ‌హారమంతా ఎంత గ‌ప్ చుప్ గా సాగిందంటే.. ఒక‌రిద్ద‌రు కీల‌క స‌భ్యుల‌కు త‌ప్ప‌… ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. అదీ.. ఈనాడు తెలివితేట‌లంటే. అయితే అన్ని మీడియా సంస్థలు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నే వాడుకుంటున్నాయి అనే విషయం ఇక్కడ గమనార్హం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close