చైతన్య : ఏపీ ప్రజలకు “ఈగో” దెబ్బ..!

సర్కార్ రోజుకొకటి తీసుకుంటున్న రద్దు నిర్ణయాల్లో కొత్తగా చేరింది.. రుణమాఫీ పథకం రద్దు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను జగన్ సర్కార్ రద్దు చేసింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ప్రజల సంక్షేమాన్ని మాత్రం కొనసాగిస్తారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది .. అమలు చేసింది కాబట్టి.. ఆ పథకాలను నిలిపివేయాలని కోరుకోరు. కానీ… ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది. సంక్షేమ పథకాలన్నింటినీ … ఏపీ సర్కార్ రద్దు చేసుకుటూ వెళ్తోంది.

పేదల కడపు నిండితే పాలకులకు ఎలా కాలింది…!?

తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయలకే నిరుపేదలకు భోజనం ఇచ్చే పథకాన్ని ప్రవేశ పెట్టింది. రోజు కూలీలు, నిరుపేదలు, చిరు వ్యాపారులకు ఇదో వరంలా మారింది. రోజంతా సంపాదన.. తిండికే సరిపోని పరిస్థితుల్లో …మూడు పూటలా.. పదిహేను రూపాయలతో కడుపు నింపుకుని మిగతా సంపాదనను… ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం దక్కిందని సంతోష పడ్డారు. కానీ.. కొత్త ప్రభుత్వానికి ఈ పథకం రుచించలేదు. వెంటనే నిలుపుదల చేసింది. అధికారంలోకి రాగానే… ఇంటర్ విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రద్దు చేసేసింది. దాంతో వారూ ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి పెద్దగా పడే భారం ఏమీ లేదు. కానీ గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిందనే కారణంగానే రద్దు చేశారు..

పేరు గొప్ప రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రుణగ్రస్థం చేయడమా..?

గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా రద్దు చేసేశారు. డ్వాక్రా సంఘాలకు.. ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. జగన్ దాన్ని రద్దు చేసేశారు. నిరుద్యోగులకు.. భృతి ఇస్తూ… ఆరేడు నెలల్లో ఉద్యోగం కూడా చూపించి పెట్టే కాన్సెప్ట్‌తో.. నిరుద్యోగ భృతిని గత ప్రభుత్వం ప్రారంభించింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసేశారు. రుణమాఫీ కాకుండా.. అన్నదాత సుఖీభవ పథకం కింద.. ఏడాదికి 15వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. తొలి విడత పంపిణీ చేశారు కూడా. అదీ రద్దయిపోయింది.

ఈగోతోనే ఇసుక సమస్య వచ్చి పడిందా..?

గత సర్కార్ ఉచితంగా ఇసుక ఇచ్చిందని.. అందులో అవినీతి జరిగిందని ఆ విధానాన్ని రద్దు చేసింది. సంక్షేమం విషయంలోనే…రద్దు సీరిస్ కొనసాగిస్తున్న ఏపీ సర్కార్.. ఇక విధాన నిర్ణయాల పరంగా ఎందుకు కామ్ గా ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల దగ్గర్నుంచి.. ఉచిత ఇసుక వరకూ.. అన్నీ రద్దు చేసేసింది. ఉచిత ఇసుక ప్రభావం… రాష్ట్రంపై తీవ్రంగా పడింది. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. దానిపై ఆధారపడిన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వీటి వల్ల ఏపీ సర్కార్ ఆదాయం కూడా పడిపోయింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఎవరూ… ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.. కానీ.. ఏపీలో మాత్రమే..గత టీడీపీ సర్కార్ అనే పదాన్ని వినియోగిస్తూ.. అన్నింటినీ రద్దు చేస్తున్నారు. ఇగోతో.. ప్రజల్ని ఎండ బెట్టడం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close