ఎనిమిదో శ్వేతపత్రం..! గ్రామీణ, పట్టణ మౌలికవసతులకు రూ.1 లక్షా 32 వేల కోట్ల ఖర్చు..!

నాలగున్నరేళ్లలో.. గ్రామీణ పట్టణ మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని.. ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.1 లక్షా 32 వేల కోట్ల ఖర్చు చేసినట్లు.. ఎనిమిదో శ్వేతపత్రంలో ప్రకటించారు. గ్రామాల్లో రూ. 55 వేల కోట్లు, పట్టణాల్లో రూ. 77 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 26 వేల ఉపాధి హామీ నిధులను.. గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల కోసం వెచ్చించినట్లు.. పత్రాలు విడుదల చేశారు. రూ.5, 694 కోట్లతో 23, 553 కిలోమీటర్ల మీ సీసీ రోడ్లు నిర్మించామని.. వీటికి ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల వినియోగించామన్నారు. నిధులను సమర్థంగా వినియోగించామన్నారు. ప్రస్తుతం 8 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రెండేళ్లలో ఏపీలోని అ్ని గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని ప్రకటించారు.

విభజనకు పూర్వం రాష్ట్రంలోని కుటుంబాలలో 22.34 లక్షల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవన్నారు. విభజన తరువాత 2014-15 నుంచి 35.64 లక్షల మరుగు దొడ్లను రూ 4,115.82 కోట్లతో నిర్మించామన్నారు. 2018 జులై 7 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా, స్వచ్చాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. 2019 జనవరి 15 నాటికి రాష్ట్రంలో 9,000 గ్రామ పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నది లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 7,813 కేంద్రాల నిర్మాణాన్ని రూ. 280.8 కోట్లతో పూర్తిచేశామన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. రెండు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందన్నారు.

గ్రామీణ మౌలిక వసతులు అన్నీ పూర్తిచేస్తాం. పల్లెల్లో పార్కులు, గోకులాలు, మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2,217 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకం చేపట్టామన్నారు. 42,458 చెక్ డ్యాములు, 31,046 ఊట చెరువులు, 45,288 చిన్నతరహా నీటి పారుదల చెరువుల అభివృద్ధి చేశామన్నారు. శ్వేతపత్రంలో.. ప్రకటించిన ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో కూడా విడుదల చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close