ఈ సారి ఈవీఎంలతో పాటు బ్యాలెట్ కౌంటింగ్ కూడా..!

బ్యాలెట్‌లో ఓట్లు ఎటు పోతున్నాయో తెలియదంటున్న పార్టీలు.. కచ్చితంగా.. వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని పట్టుబడుతున్నాయి. కానీ ఆలస్యం జరుగుతుందని.. కుదరదని ఈసీ చెప్పుకుంటూ వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో… లెక్కించడం తప్పేమీ కాదన్న నివేదిక… ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌ని ఈసీ అడిగింది. ఈ సంస్థ.. సానుకూలంగా స్పందించింది. అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో మాత్రమే వీవీ ప్యాట్లను లెక్కించాలని గతంలో ఈసీ ఆదేశాలు ఇచ్చింది. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 22 పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

వీవీ ప్యాట్ల కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు.. ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈసీకి కూడా నోటీసులు పంపింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ….ఐఎస్ఐ..ని కోరింది. ఈ నెల 25న సుప్రీం కోర్టులో కేసు విచారణకు రానుంది. భారీ స్థాయిలో వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యమేనని ఐఎస్ఐ తేల్చింది. దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరింది. యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్ సహేతుకమైనదేనని అంటూ.. అన్ని కుదరకపోయినా వీలైనన్ని ఎక్కువ వీవీ ప్యాట్లను లెక్కించే చర్యలు చేపట్టడంలో తప్పు లేదని నివేదికలో అభిప్రాయపడ్డారు.

నివేదికను ఈ నెల 25న సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. 17వ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుజరిగే మే 23 లోపే సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించేందుకు మూడు నుంచి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని 22 పార్టీలు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నాయి. ప్రజాస్వామ‌్యంలో ఏదైనా నమ్మకం ముఖ్యం కాబట్టి.. అనుమానాలు నివృతి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close