టీఆర్ఎస్‌ సర్కార్‌కు గుదిబండగా ఎన్నికల హామీలు..! రుణమాఫీ ఎలా..?

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల హామీలు నెరవేర్చడం… కష్టంగా మారిపోతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూ. రెండు లక్షల ఒకే సారి రుణమాఫీ హామీతో పాటు.. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. రైతులు ఎక్కడ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతారోనని.. టీఆర్ఎస్ కూడా.. రుణమాఫీ పథకం ప్రకటించింది. అయితే.. రూ. లక్ష మాత్రమే.. ప్రకటించింది. అదీ ఒకే సారి చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీలన్నీ అమలు చేయడం తలకు మించిన భారంగా.. సర్కార్‌కు మారింది. ముఖ్యంగా రూ. లక్ష రుణమాఫీని ఎలా చేయాలని తంటాలు పడుతోంది. నిధుల అన్వేషణ చేస్తోంది.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ. లక్ష రుణమాఫీ చేయడానికి బ్యాంకర్ల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఇవి రూ. 24 వేల కోట్లున్నట్లు తేలింది. ఒకే సారి మాఫీ చేయడం అసాధ్యం కాబట్టి… నాలుగు విడతలుగా చెల్లించాలని నిర్ణయించారు. ఈ రుణాలను ఏటా ఆరువేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఈ ఏడాదిలో ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. రైతు బంధు కోసం రూ. 6900 కోట్లు విడుదల చేసారు. ఆసరా పెన్షన్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండు,మూడు నెలల పాటు నిధుల కొరత తీవ్రంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు తీసుకుంటే తప్ప పెద్ద పద్దులు చెల్లించే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. ఆగస్టులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వతా మరో విడత అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమయంలో వచ్చే నిధులతో సెప్టెంబరు మొదటి వారంలో మొదటి విడతగా రూ. ఆరు వేల కోట్లు రుణమాఫీకి నిధులు విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. రుణమాఫీ నిధులను చెక్కుల రూపంలో నేరుగా రైతులకు అందించాలనుకుంటున్నారు. బ్యాంకర్లతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. ఏలా చూసినా ఈ ఏడాది చివర మాత్రమే.. రుణమాఫీ తొలి విడత విడుదల చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close