రేవంత్‌ ఎపిసోడ్‌ ముగింపు..

తెలుగుదేశం అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటననుంచి నేరుగా హైదరాబాద్‌ వస్తున్నారు గనక.. రాగానే టిటిడిపి నేతలను కలుస్తున్నారు గనక పది రోజుల రేవంత్‌ ఎపిసోడ్‌ ముగిసిపోవడం తథ్యం. వాస్తవానికి టిడిఎల్‌పి సమావేశం రద్దు, అద్యక్షుడు రమణపై విమర్శలు, బిజెపితో కలసి కూచోవడాన్ని భోజనాలు చేయడమని ఎద్దేవా చేయడం ,కాంగ్రెస్‌ వారితో ఆలింగనాలు వీటన్నిటితో రేవంత్‌ తన గమనం ఏమిటో చెప్పేశారు. బిఎసి సమావేశానికి పార్టీ తరపున హాజరైన సండ్ర వెంకట వీరయ్య ఈ సమావేశాల వరకూ ఇటే వుంటారని కూడా తేలిపోయింది. ఇక ఆర్‌.కృష్ణయ్య తాను బిసిఎజెండాకే ప్రాధాన్యత నిస్తానంటూనే రమణ మాట పాటిస్తున్నాట్టు చెప్పేశారు. వారిద్దరూ లేకపోయాక రేవంత్‌ ఎల్‌పి అంటూ వుండదు. ఇంత రచ్చ తర్వాత ఏ పార్టీ కూడా ఆయనను తమ సభ్యుడుగా అనుమతించదు. బహుశా చంద్రబాబు మొదటి సమావేశంలనే రేవంత్‌పై వేటు వేసే అవకాశం అత్యధికంగా వుంది. విచిత్రంగా ఈ ఆఖరి సన్నివేశంలో కూడా రేవూరి ప్రకాశరెడ్డి వంటివారు రేవంత్‌ పార్టీ మారకపోవచ్చని చెబుతున్నారు.అంటే టిటిడిపిలో బిసిలుఎస్‌సిలే రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారని, కొందరు సమర్థిస్తున్నారని చెప్పే మాట నిజమేనా? ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు మాజీలైతే ఆయన వెంట వెళ్లవచ్చు గాని టిటిడిపి సంస్థాగతంగా తనను తాను కాపాడుకుంటుంది. తెలంగాణలో ఆ పార్టీకి వున్న విస్తారమైన ఆస్తులు, కార్యకర్తల యంత్రాంగం ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు.భారత దేశంలో ఇంతవరకూ ఎంజిఆర్‌, మూపనార్‌, నవీన్‌ పట్నాయక్‌, జగన్‌ వంటి కొద్దిమందే పార్టీనుంచి బయిటకు వచ్చి తమ బలం చూపగలిగారు. అయితే ఇక్కడ రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లడం వల్ల ఆ ప్రత్యేకత కూడా వుండదు. అందులో ఆయనకు ఏ స్థానం లభిస్తుందనేదే ఇక తేలాలి.టిడిపిలో వున్న స్థానాలు పోయాయి ఎంఎల్‌ఎ స్థానం చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.అయితే బహిష్కరిస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు గనక ఆ పనిచేయకుండా మరింత నాటకానికి అవకాశం తీసుకుంటారేమో తెలియదు. కాని గతంలోఫిరాయింపులపై అంతగా పోరాడిన రేవంత్‌ ఇప్పుడు తన సీటు కాపాడుకోవడం కన్నా రాజీనామా చేస్తేనే గౌరవంగా వుంటుందని చాలామంది అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close