‘శ్రీమంతుడు’ హిందీ రైట్స్‌కోసం ‘ఈరోస్’, ‘వయాకామ్’ మధ్య తీవ్ర పోటీ

హైదరాబాద్: ‘శ్రీమంతుడు’ తెలుగులో రెండో అతి పెద్ద హిట్ కావటంతో హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్‌లో తీవ్ర పోటీ ఏర్పడింది. ‘ఈరోస్’ సంస్థ వరుణ్ ధావన్‌తో దీనిని రీమేక్ చేయాలని చూస్తుండగా, ‘వయాకామ్’ సల్మాన్ ఖాన్‌తో రూపొందించాలని భావిస్తోంది. మరోవైపు సల్మాన్‍‌తో బజరంగీ భాయిజాన్ చిత్రాన్ని తీసి బంపర్ హిట్ కొట్టిన కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కూడా మళ్ళీ సల్మాన్‌తో ‘శ్రీమంతుడు’ రీమేక్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ పోటీలో ఈరోస్ సంస్థే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, సౌత్ ఇండియా సూపర్ హిట్ సబ్జెక్ట్‌లు ఈమధ్య హిందీలో బాగా హిట్ అవుతుండటంతో హిట్‌లు కొట్టిన సౌత్ నిర్మాతలు రీమేక్ రైట్స్ రేటు విషయంలో చెట్టెక్కి కూర్చుంటున్నారట. శ్రీమంతుడు చిత్ర నిర్మాతలు కూడా దీనికి మినహాయింపు కాదని తెలుస్తోంది. బాలీవుడ్ రీమేక్ రైట్స్ కోసం భారీ రేటు చెబుతున్నారట. ‘శ్రీమంతుడు’ హిందీ రీమేక్ రైట్స్ ఎవరు కొన్నాగానీ, శ్రీమంతులు అయ్యేది మాత్రం తెలుగు నిర్మాతలేనన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close