హమ్ ఆప్ కే హై కౌన్ !

ఆమ్ ఆద్మీ పార్టీ వారి లీలా విన్యాసాల పరంపర ఆగటం లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ బాధ్యతా రాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. మంత్రి గోపాల్ రాయ్ మరీ అమానుషంగా ప్రవర్తించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సదరు మంత్రిగారు శుక్రవారం ఛత్తీస్ గఢ్ వెళ్లారు. ఆయనకు సెక్యూరిటీగా పోలీసులు మరో వాహనంలో వెంట వెళ్లారు. కాంకేర్ లో మీడియాతో మాట్లాడిన తర్వాత రాయ్ భానుప్రతాప్ పూర్ వెళ్లారు. ఆయన కాన్వాయ్ లోని సెక్యూరిటీ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఇది తెలిసి కూడా మంత్రి గారు అక్కడ ఆగలేదు. పోలీసుల గురించి పట్టించుకోలేదు. కూల్ గా ముందుకు వెళ్లిపోయారు. కాన్వాయ్ లోని ఇతర పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. తన పర్యటన ముగిసిన తర్వాతైనా, ఆస్పత్రికి వెళ్లి ఆ పోలీసులను పరామర్శించాలనే ఆలోచనే మంత్రి గారికి రాలేదు. ఆయన తిన్నగా ఢిల్లీ వెళ్లిపోయాడు.

మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తనకు భద్రతగా వచ్చిన పోలీసుల పట్ల కూడా కనీస మానవత్వం చూపక పోవడం ఆమ్ ఆద్మీ మంత్రికే చెల్లిందని కాంగ్రెస్, బీజేపీ నేతలువిమర్శించారు. సోషల్ మీడియాలోనూ మంత్రి తీరుపై చాలా మంది మండిపడ్డారు. ఆప్ మంత్రులు అమానవీయంగా ప్రవర్తించడం ఇది మొదటి సారి కాదనే విమర్శలుకూడా ఉన్నాయి.

ఢిల్లీ ప్రజలు డెంగీ, చికన్ గున్యాతో బాధ పడుతున్నారు. వారం రోజులుగా పరిస్థితి భయానకంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ సర్కారు వారి ఆధ్వర్యంలోని పలు ఆస్పత్రుల్లో కనీసం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయం లేదు. రోగులకు సరిగ్గా వైద్యం అందటం లేదు. అయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏడాది తర్వాత రాబోయే ఎన్నికల కోసం ప్రచారంలో మునిగిపోయారు. ఆ తర్వాత సర్జరీ కోసమంటూ బెంగళూరు వెళ్లిపోయారు.

ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఫిన్లాండ్ విహార యాత్రలో ఉన్నారు. ఇక, గోవా టూర్లో ఉన్న వైద్య శాఖ మంత్రి ఢిల్లీ వచ్చినా, చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. చికన్ గున్యా వల్ల మరణాలు సంభవించవని గూగుల్ చెప్తోందన్నారు. మరణాలకు కారణం డెంగీ అన్నారు. వ్యాధి ఏదైనా చికిత్స అందించాలి కదా అంటే బాధ్యతా రహితంగా జవాబిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close