న‌ర్త‌న‌శాల‌ని అడ్డుకుంటారా?

ఈమ‌ధ్య ప్ర‌తీ సినిమానీ ఏదో ఓ వివాదం చుట్టుముట్టుకోవ‌డం సాధార‌ణ‌మైపోయింది. ‘మా మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయి’ అంటూ మీడియాకెక్క‌డం, ప‌రోక్షంగా ఆ సినిమాకి ప్ర‌చారం క‌ల్పించం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ‘@ న‌ర్త‌న‌శాల‌’కీ అలాంటి ఫ్రీ ప‌బ్లిసిటీ దొర‌క‌బోతోంది. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. ఈవార‌మే విడుద‌ల కాబోతోంది. ఇందులో శౌర్య `గే` పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ సినిమాపై హిజ్రాలు ఓ క‌న్నేశారు. ఇందులోని కొన్ని స‌న్నివేశాలు మా మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయంటూ…. అడ్డుకునే ప్ర‌య‌త్నాల్లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు కొంత‌మంది హిజ్రాలు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో కొంత‌మంది పెద్ద‌ల్ని క‌ల‌సి ఓ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించార్ట‌. సినిమా విడుద‌లకు ముందు మాకు చూపించాల్సిందే అని ప‌ట్టుప‌డుతున్నార్ట‌. విడుద‌ల‌య్యాక థియేట‌ర్ల ద‌గ్గ‌ర హిజ్రాలు ఏమైనా నిరస‌న వ్య‌క్తం చేస్తారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయిప్పుడు. మ‌రోవైపు చిత్ర‌బృందం మాత్రం ‘ఈ సినిమాలో ఏ ఒక్క‌రినీ కించ‌ప‌రిచే స‌న్నివేశాలు లేవు. కేవ‌లం స‌ర‌దాగా న‌వ్వుకోవ‌డానికి మాత్ర‌మే ఈ సినిమా రూపొందించాం’ అని చెబుతున్నారు. ఏదేమైనా.. న‌ర్త‌న‌ల శాల‌కు ఈ రూపంలో ఫ్రీ ప‌బ్లిసిటీ దొరికిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com