‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌: కేసీఆర్ పాత్ర కూడా ఉందా??

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రోజురోజుకో ప్ర‌త్యేక‌త చేరుతూ వ‌స్తోంది. పాత్ర‌లు, దానితో పాటు సినిమా ప‌రిధి కూడా పెరుగుతోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, ల‌క్ష్మీపార్వ‌తి లాంటి ప్ర‌ధాన‌మైన పాత్ర‌లే గుర్తొస్తాయి. అయితే.. ఈ క‌థ‌లో చాలా కోణాలున్నాయి. చాలా పాత్ర‌లు ఉన్నాయి. వాటిలో కేసీఆర్ కూడా ఒక‌ట‌ని, ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఆయ‌న పాత్ర కూడా క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సీఎం, ఓ పార్టీకి అధ్య‌క్షుడు. కానీ ఆయ‌న ఎన్టీఆర్ వీరాభిమాని. 1982లో టీడీపీ పార్టీ స్థాపించిన‌ప్పుడు…. మొట్ట‌మొద‌ట ఆ పార్టీలో అడుగుపెట్టిన‌వాళ్ల‌లో కేసీఆర్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ సంక్షోభంలో ఉన్న‌ప్పుడు కూడా.. ఆయ‌న అన్న‌కు చేదోడు వాదోడుగా నిలిచారు. త‌న త‌న‌యుడికి `రామారావు` అనే పేరు క‌లిసొచ్చేలా కేటీఆర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. అంత‌టి అభిమానిని ఈ క‌థ‌లో చూపించ‌కుండా ఎలా ఉంటారు. అందుకే క్రిష్ ఈ పాత్ర‌నీ క‌థ‌లో జోడించార్ట‌. ఇందులో మ‌రో స్వార్థం కూడా ఉంది. కేటీఆర్ ఈ సినిమాలో ఉన్నారంటే… తెలంగాణ‌లో `ఎన్టీఆర్‌` సినిమా మైలేజీ ఇంకాస్త పెరుగుతుంది. దాంతో.. కేటీఆర్‌ని ఈ క‌థ‌లోకి తీసుకురాక త‌ప్ప‌లేదు. మ‌రి ఆ పాత్ర ఎవ‌రు పోషిస్తారు? నిడివి ఎంత సేపు ఉంటుంది? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close