తెలకపల్లి వ్యూస్: మాజీ డిజిపినోట మామూలు మాటలు

నయీం ఉదంతంపై మాజీ డిజిపి దినేష్‌రెడ్డి సామాన్యులలాగే మాట్లాడ్డం తప్ప వ్యక్తిగతంగా గాని వ్యవస్థాగతంగా గాని ఒకింత బాధ్యత తీసుకోలేదు. బిజెపి తరపున మాట్లాడుతున్నట్టు ఆయన ప్రకటించారు. దీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన ఆయన అతన్ని హతం చేయడానికి అనుమతించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసించారు. ే అంతకు ముందు అనుమతినివ్వని వారిని విమర్శించబోనంటారు. ఇన్‌ఫార్మర్‌గా వున్న నయీంతో డిజిపి వంటి స్తాయి గల వ్యక్తులకు సంబంధం వుండదట.ఎన్‌కౌంటర్‌ వార్తలో ఫోటోలు చూసి మొదట ఎవరీ బఫూన్‌ అనుకున్నారట. తర్వాతనే అతను నయీం అని తెలిసిందట. ఉమ్మడి రాష్ట్ర డిజిపిగానూ ఇంకా అనేక రూపాల్లోనూ ఉన్నత బాధ్యతలు నిర్వహించిన ఐపిఎస్‌ అధికారి నయీం ఫోటో చూసిన తర్వాత కూడా పేరు వచ్చాక గాని తెలుసుకోలేకపోయానని చెప్పడం హాస్యాస్పదం. రాష్ట్రాన్ని పీడిస్తు వందల వేల కోట్లు వసూలు చేస్తున్న ఒక మాఫియా డాన్‌ గురించి తెలుసుకోకుండా కేవలం ఇన్‌ఫార్మరగా పరిగణించి వదిలేస్తారా? అలాగైతే అతన్ని పట్టుకోమని ఆదేశాలు ఎందుకు ఇచ్చారు?ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. మురికివివాదాలు బహిరంగంగా మాట్లాడ్డం తనకిష్టం లేదంటూనే తనకు ఇష్టం లేని వారి పేర్లు హౌదాలు ప్రస్తావించారాయన. ఇప్పుడున్న డిజిపితో సహా అందరూ తన శిష్యులేనని కూడా ప్రకటించారు. గురువులపై శిష్యులు విచారణ జరపడం కష్టమైన విషయమని సమాజంలో సందేహాలు వస్తుంటాయి. వ్యాస్‌ హత్య జరిగినప్పుడు దూరంగా వున్నానని దాటేశారే గాని ఆ దర్యాప్తుకు సహకరించలేదన్న ఆరోపణకు సమాధానం లేదు. పైగా ఆ దర్యాప్తు అధికారిని తర్వాత వేధించారన్న విమర్శలున్నాయి. ఇంత జరిగాక కూడా నయీం ఉదంతం ఏదో మామూలు వ్యవహారమన్నట్టు మాట్లాడారే గాని పోలీసు వ్యవస్థ వైఫల్యం కుమ్మక్కు వున్నాయని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కేసు వుంటే మంత్రినైనా సరే ఎస్‌ఐ కూడా విచారించవచ్చని చెబుతున్న మాజీ డిజిపి నయీంను పట్టుకోవాలని తానిచ్చిన ఉత్తర్వును ఎందుకు అమలు చేయాలేదు? తనపై కథనం ప్రసారం చేసిన ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చయవచ్చు గాని బాధ్యతా యుత స్పందనగా అనిపించలేదు.

ఇక ఈ వ్యాఖ్యల విషయంలో బిజెపి వైఖరి తెలుసుకుందామని అధికార ప్రతినిధితో మాట్లాడితే అంతా దినేష్‌రెడ్డి అత్యుత్సాహం తప్ప పార్టీకి సంబంధం లేదని ఆ ప్రతినిధి చెప్పారు. నయీం విషయంలో జరిగినదాన్ని తాము హర్షిస్తున్నామని, పెద్దగా మాట్లాడనవసరం లేదని భావించామని అన్నారు.

అమిత్‌ షా కు సంబంధించిన షాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నయీం పాత్ర గురించిన ప్రశ్నలను కూడా ఆ
ప్రతినిది తేలిగ్గా కొట్టిపారేస్తూ ఎన్నొ వస్తుంటాయి అన్నీ నిజం కావాలనిలేదు అని వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close