భాజ‌పాలో చేరిన‌ వివేక్… ఆయ‌న‌కి ద‌క్క‌బోతే పాత్రేంటి..?

గ‌త కొన్ని నెల‌లుగా మాజీ ఎంపీ వివేక్ భాజ‌పాలో చేర‌తారూ అంటూ వార్త‌లొచ్చాయి. అబ్బేం అదేం లేదు… స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చెబుతా అంటూ వ‌చ్చారాయ‌న‌! గ‌త నెల‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని క‌లిసిన‌ప్పుడే కాషాయ కండువా కప్పేసుకుంటార‌ని అనుకున్నారు. కానీ, ఆషాఢం అడ్డొచ్చింద‌నీ ముహూర్తాలు కుద‌ర్లేద‌నే కార‌ణాల‌తో ఆగార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం రోజు మంచిద‌ని అనుకున్నారో ఏమో… మొత్తానికి ఇవాళ్ల భాజ‌పాలో చేరిపోయారు. భాజ‌పా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో మాజీ ఎంపీ వివేక్ పార్టీలో చేరారు. అంత‌కుముందు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాని క‌లుసుకున్నారు.

అనంత‌రం మీడియాతో వివేక్ మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి పోరాటం చేస్తున్నానీ, భాజ‌పాతో క‌లియడంతో ఆ పోరాటం ఇప్పుడు మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌న్నారు. కేసీఆర్ నియంతృత్వ పాల‌నను దెబ్బకొట్టాల‌ని ప్ర‌జ‌లు కూడా ఎదురు చూస్తున్నార‌న్నారు. గ‌తంలో తెరాస‌లో, తిరిగి కాంగ్రెస్ లోకి, ఆ త‌రువాత తెరాస‌లోకి, ఇప్పుడు భాజ‌పాలోకి… ఇలా ప‌దేప‌దే పార్టీలు మార‌డంపై త‌న‌కు ఎలాంటి ఇబ్బందిగా అనిపించ‌డం లేద‌న్నారు! కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు తాను తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల పాత్ర పోషించ‌డం కోసం తెరాస‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు. కేవ‌లం ఉద్య‌మం కోస‌మే తెరాస‌కు వెళ్తున్నాన‌నీ, రాష్ట్రం రాగానే తిరిగి వ‌చ్చేస్తాన‌నీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకం కాద‌ని నాడు సోనియాకు చెప్పాన‌న్నారు. తెలంగాణ వ‌చ్చాక తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తాన‌ని కేసీఆర్ అన్నార‌నీ, కానీ మాట త‌ప్పార‌న్నారు. ఆ త‌రువాత తాను కాంగ్రెస్ లోకి వ‌చ్చినా త‌గిన గుర్తింపు లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానెప్పుడూ స్వార్థం కోసం పార్టీలు మార‌లేద‌నీ, ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా మారాల్సి వ‌చ్చింద‌న్నారు!

తెలంగాణ భాజ‌పాలో తాను ఎలాంటి పాత్ర పోషిస్తాన‌నేది ఇప్పుడే చెప్ప‌లేన‌న్నారు! అయితే, కేసీఆర్ ని గ‌ద్దె దించ‌డమే త‌న పోరాట ఉద్దేశం అంటున్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ, సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణాల‌ను మార్చాలంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై పోరాటం ప్రారంభించారు. సొంతంగా దానిపై కొంత కార్యాచ‌ర‌ణ కూడా న‌డిపించారు. ఇక ఇప్పుడీ పోరాటం భాజ‌పాది అవుతుందా, దాన్ని వివేక్ లీడ్ చేస్తారా… వివేక్ కి ఇప్పుడున్న భాజ‌పా రాష్ట్ర నేత‌లు ఆ స్థాయి అవ‌కాశం ఇస్తారా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close