ప్రభుత్వాధికారిని కొట్టటంపై సిద్దరామయ్య వివరణ

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్న బళ్ళారి నగరంలో మీడియా ఎదుటే ఒక వ్యక్తిపై చేయిచేసుకోవటం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటం తెలిసిందే. ముఖ్యమంత్రి చేతిలో దెబ్బతిన్నది బళ్ళారి నగర కమిషనర్ పీజీ రమేష్ అని నిన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ కమిషనర్ రమణ, ముఖ్యమంత్రి ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. మరోవైపు ముఖ్యమంత్రి తన ఫేస్‌బుక్ పేజిలో దీనిపై వివరణ ఇచ్చారు. నిన్న బళ్ళారి వాల్మీకి భవన్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తాను ఒక ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయని, ఈ వార్తలు తనను ఆశ్చర్యానికి, విచారానికి గురిచేశాయని పేర్కొన్నారు. తాను ఏ అధికారిపైనా చేయిచేసుకోలేదని రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఫేస్‌బుక్ పేజి ద్వారా తెలియజేయాలనుకుంటున్నానని రాశారు. మరోవైపు బళ్ళారి కమిషనర్ రమేష్ కూడా దీనిపై వివరణ ఇస్తూ, ముఖ్యమంత్రి కొందరు భద్రతా సిబ్బందిపై కోప్పడ్డారని, తనపై కాదని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close