పోలీస్‌బాబులూ… ముందు మా సిన్మా చూడండి

శ్రీ‌కాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మెంట‌ల్ పోలీస్ టైటిల్ వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసింది. ఈ టైటిల్ పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా శ్రీ‌కాంత్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ త‌ర‌వాత హైకోర్టు ఈ సినిమా టైటిల్ మార్చేంత వ‌ర‌కూ విడుద‌ల‌ను నిలిపివేయాలని ఆదేశించింది. అయినా స‌రే… చిత్ర‌బృందం మాత్రం టైటిల్‌ని కాపాడుకొనే ప్ర‌య‌త్నాల్లోనే ఉంది. ‘మా సినిమాకి ఇదే స‌రైన టైటిల్’ అంటూ వాదిస్తోంది. ”కావాలంటే మా సినిమాచూడండి. ఆ త‌ర‌వాత ఈ టైటిల్ ఉంచాలో, తీసేయాలో పోలీసులనే చెప్ప‌నివ్వండి” అంటూ విన్న‌వించుకొంటోంది.

”పోలీసుల గౌర‌వాన్ని నిలిపే చిత్రం మెంట‌ల్ పోలీస్‌. ఈసినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థ‌మ‌వుతుంది. పోలీస్ శాఖ‌కి ప్ర‌త్యేకంగా మా సినిమా చూపించాల‌నుకొంటున్నాం. సినిమా చూసిన త‌ర‌వాత కూడా టైటిల్ మార్చాల్సిందే అని వాళ్లు చెబితే త‌ప్ప‌కుండా మేం టైటిల్ మారుస్తాం” అంటూ ద‌ర్శ‌కుడు బాబ్జీ పోలీస్ శాఖ‌ని కోరుతున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో పోలీస్ ఉన్న‌తాధికారుల‌కు మెంట‌ల్ పోలీస్ ప్ర‌త్యేక్ష షో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నార‌ని తెలిసింది. మ‌రి ఈ సినిమా చూశాక పోలీసులు ఏమంటారో? టైటిల్ ఉంచినా, తీసేసినా.. ఈ సినిమాకి రావ‌ల్సిన ప‌బ్లిసిటీ మాత్రం టైటిల్ రూపంలో వ‌చ్చేసింది. సో.. చిత్ర‌బృందం ఆ విష‌యంల‌తో హ్యాపీనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close