ఎక్స్‌ప్రెస్‌ టివి కొత్త రికార్డు

తెలుగు న్యూస్‌ ఛానళ్లలో ఎక్స్‌ప్రెస్‌ టివి కొత్త రికార్డు సృష్టించింది. సిబ్బంది సమ్మెతో వరుసగా 24 గంటల పాటు ప్రసారాలు నిలిచిపోయిన ఛానల్‌గా కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఛానల్‌ యాజమాన్యంతో ఉద్యోగులు చేసిన చర్చలు ఫలించకపోవడంతో ప్రసారాలు రెండో రోజు కూడా నిలిచిపోయాయి. యాజమాన్య ప్రతినిధిగా శిఖా చౌదరి అలియాస్‌ మాధురి ఉద్యోగులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఛానల్‌ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని ఇమె వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఛానల్‌ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుపోయింది. వ్యక్తిగత సమస్యలతో వందల కోట్ల వ్యాపారాన్ని నిలువున నాశనం చేసుకుంటున్న వ్యక్తిగా చిగురుపాటి జయరామ్‌ రికార్డు సృష్టిస్తున్నారు. రేటింగుల పరంగా బార్క్‌లో సైతం టాప్‌ 5లో కొనసాగుతున్న ఛానల్‌ ఆర్ధికంగా ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి కొందరు సిబ్బందే కారణంగా తెలుస్తోంది. గతంలో జీ ఛానల్‌ మూతబడటానికి కారణమైన వ్యక్తులే ఇక్కడ కూడా దందాకు తెర తీయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జర్నలిస్టుగా ఏ మాత్రం ప్రతిభ లేకపోయినా కేవలం పైరవీ., కులం కార్డుతో ఉన్నత స్థానంలో కూర్చున్న ఓ వ్యక్తి యాజమాన్యాన్ని మిస్‌ లీడ్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జీ టీవిలో ఉన్న ఆఫ్‌ రోల్‌ విధానంతో సమస్యలన్ని గట్టెక్కుతాయని డాక్టర్‌ జయ్‌ను మభ్యపెట్టడంలో విజయం సాధించాడు. కీలకమైన జిల్లాలతో పాటు వసూళ్లు చేసే తన అనుచరులను మాత్రం మిగుల్చుకుని మిగిలిన వారిని ఇళ్లకు పంపేలా స్కెచ్‌ వేశాడు. ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో ప్రబుద్దుడు ఇందుకు సహకరించాడు. వీరి పన్నాగాన్ని పసిగట్టిన ఉద్యోగులు బుధవారం ఒక్కసారిగా సర్వర్‌ నిలిపి ఆందోళనకు దిగారు. అంతకుముందే లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాుద చేసినా స్పందన లేకపోవడంతో మూడు నెలల బకాయిల వసూలు కోసం టూల్‌ డౌన్‌ ప్రారంభించారు. జిల్లా రిపోర్టర్లు కూడా ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటించారు.
సిబ్బంది సమ్మెపై యాజమాన్యం., గురువారం ఆఫీసులో సుదీర్ఘంగా చర్చలు జరిగినా సిబ్బంది మాత్రం వెనకడుగు వేయలేదు. యాజమాన్య తొత్తులుగా వ్యవహరించిన రెండు మూడు గుంట నక్కలు సంస్థ జీతాలు చెల్లించే పరిస్థితిలో లేదని., బకాయిలు గురించి మరచిపోవాలంటూ…, తాము పని చేస్తామంటూ ముందుకు రావడంతో మిగిలిన సిబ్బంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభమవుతుండటం., ఇళ్ల అద్దెలు పేరుకుపోవడంతో జీతం బకాయిలు ఒకేసారి చెల్లించడం, ఉద్యోగాల నుంచి తొలగించే వారికి మూడు నెలల వేతనం చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పడంతో ఖంగుతినడం కంత్రిగాళ్ల పనైంది. అటు ఆంధ్రా., ఇటు తెలంగాణల్లో ఇన్‌కమ్‌ ఉన్న సెంటర్లను మాత్రం అట్టిపెట్టుకోవడంలోనే మధ్యవర్తుల తత్వం అర్థమవుతోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. వేతనాలు చెల్లించకుండా పరారీలో ఉన్న జయరామ్‌ మలేషియా నుంచి 28న వచ్చే వరకు వేచి చూడాలని చెప్పినా ఉద్యోగులు శాంతించలేదు. మరోవైపు ఇదే గ్రూపుకు చెందిన టెక్ట్రాన్‌., హెమరాస్‌ వంటి సంస్థల ఉద్యోగులకు కూడా చాలా కాలంగా వేతనాలు చెల్లించట్లేదు. హెమరాస్‌ సంస్థ ఆస్తుల్ని బ్యాంకులు వేలానికి కూడా ప్రకటించాయి. తాజా ఎక్స్‌ప్రెస్‌ టీవీ సంక్షోభంలో చిక్కుకోవడంతో వీళ్ల చేతుల్లో ఉన్న బ్యాంకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా., తెలంగాణల్లో రెండు బ్యాంకుల్ని నిర్వహిస్తోన్న ఈ సంస్థల్లో కూడా అవకతవకలున్నాయనే ఆరోపణలున్నాయి.

‍యాడ్‌ రెవిన్యూను అంచనా వేయకుండా వేల రుపాయల జీతాలు చెల్లించడం ఎక్స్‌ప్రెస్‌ టివి యాజమాన్యం చేసిన మొదటి తప్పు. ఛానల్‌ ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఆంధ్రా., తెలంగాణల్లో టామ్‌ సెంటర్లు తప్ప మిగిలిన చోట్ల ఛానల్‌ రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. రేటింగుల విషయంలో మార్కెట్లో రకరకాల అనుమానాలు ఉన్నా దానిపై స్పష్టతనిచ్చే వారు కరువయ్యారు. ఉద్యోగులు మాత్రం వేతన బకాయిలు., పిఎఫ్‌ బకాయిలు చెల్లిస్తే తమ దారి తాము చూసుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ సర్కారుకు ఇప్పటికే కొందరు ఫిర్యాదు చేయగా శుక్రవారం మంత్రి నాయని నర్సింహా రెడ్డిని కలిసే యోచనలో ఉద్యోగులు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com