అక్కడ బాహుబలిని కొట్టేసింది

ఉత్తరాంధ్ర సినిమా అంటే ఇప్పుడు ‘ఉత్త’ది కాదు. టాలీవుడ్ కు నైజాం ఎంత ముఖ్యమైనదో, ఉత్తరాంధ్ర (మూడు జిల్లాలు) అంత కీలకంగా మారాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే అక్కడ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ముందు ఇప్పుడు సీడెడ్ చాలా చిన్నదైపోతోంది. పైగా సీడెడ్ లో పక్కా మాస్ యాక్షన్ సినిమాలే ఫేర్ చేస్తాయి. కానీ ఉత్తరాంధ్ర అలా కాదు. ఇటు ఎంటర్ టైన్ మెంట్, అటు యాక్షన్ ఏదయినా ఓకె.

ఎఫ్ 2 సినిమా సీడెడ్ లో అంత ప్రభావం చూపలేకపోయింది.కానీ ఉత్తరాంధ్రలో మాత్రం కుమ్మేసింది. దాదాపు పది కోట్ల మేరకు కలెక్షన్లు అంటే చిన్న విషయం కాదు. బాహుబలి పార్ట్ ను ఎఫ్ 2 దాటేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో ఆడిందో? బాహుబలి ఫార్ట్ వన్ 9.75 కోట్లు వసూలు చేస్తే, ఎఫ్ 2 ఇప్పటికి అంటే 25 రోజులకు 9.89 కోట్లు వసూలు చేసింది. దాంతో ఉత్తరాంద్రలో టాప్ 4 లోకి వచ్చి చేరింది.

అంతకు మించి టాప్ 3 లోకి వెళ్లడం మాత్రం కష్టం. ఎందుకంటే ఆ ప్లేస్ లో వున్న మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 అంత సులువుగా అంతనంత ఎత్తులోవుంది. అలాగే కృష్ణలో కూడా భరత్ అనే నేను ప్లేస్ ను ఎఫ్ 2 ఆక్యుపై చేసేసే టైమ్ దగ్గరకు వచ్చేసింది.

కానీ ఉత్తరాంధ్ర, నైజాంల్లో కుమ్మినట్లు ఎఫ్ 2 అటు సీడెడ్ కానీ, మరి కొన్ని ప్రాంతాల్లో కానీ వసూళ్లు సాగించలేదు.అయితే అక్కడ కూడా బయ్యర్లు రూపాయికి రూపాయి తెచ్చుకున్నారు. నిర్మాత దిల్ రాజు స్వంతానికి ఉంచుకున్న నైజాం, వైజాగ్ లు మాత్రం ప్రత్యేకంగా మిగిలిపోయాయి ఆ సినిమాకు. ఆ రెండు ఏరియాలు కలిపే దగ్గర దగ్గర 33 కోట్లు అంటే సినిమా నిర్మాణ వ్యయంతో సమానంగా వసూళ్లు సాగించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close