సర్వే” జనాలు సుఖినోభవంతు..! పాపం ప్రజలే బకరాలు..!!

సాధారణ ఎన్నికలు ముందుగా వస్తాయో రావో కానీ.. సర్వేలు మాత్రం .. రొజుకొకటి చొప్పున బయటకు వస్తోంది. ఒక దానికి ఒకటి పొంతన ఉండదు. కొన్ని సర్వేలు కనీసం ప్రజాభిప్రాయానికి కూడా దగ్గరగా ఉండవు. అయినా ప్రసారం చేసేస్తారు. దాని మీద విశ్లేషణలు చేసేస్తారు. నమ్ముతారో.. లేదో అన్నది తరవాత విషయం అన్నట్లు ఉంది వీరి వ్యవహారశైలి. రెండు రోజుల కిందట.. టైమ్స్ నౌ ప్రకటించిన సర్వే చేసి… ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కవ్వాల్సి వచ్చింది. ప్రజలే కాదు.. ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా… ఆ సర్వే చూసి షాక్ తినడం ఖాయం. ఎందుకంటే… భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఏడు ఎంపీ సీట్లు వస్తాయట. కాంగ్రెస్ కు మూడు ఎంపీ సీట్లు వస్తాయట. ఆ సర్వేను ఎలాంటి శాంపిల్ తీయకుండా… అదీ కూడా.. ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి చేసిన సర్వే అని స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం.. తమ నెట్ వర్క్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ని అడిగినా… అసలు విషయం ఏమిటో అర్థమైపోతుంది. కానీ ఇది సీరియస్ గా చేసిన సర్వే కాదు.. ప్రజల్ని బకరాలను చేయడానికి చేసిన సర్వే. బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికో.. ఆల్రెడీ… ప్రసన్నమైపోయి ఉన్నారు కనుక.. మరింత రంజింప చేయడానికో.. ఈ సర్వేను ప్రకటించినట్లు సులువుగా అర్థమైపోతుంది.

ఈ కామెడీ ఇలా ఉండగానే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే దరువు అనే ఫేక్ న్యూస్ వెబ్ సైట్… మరో సర్వేలను ప్రచారంలోకి తెచ్చింది. దీనికి క్రెడిబులిటీ తెచ్చి పెట్టుకోవడానికి ఏకంగా… మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు… ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన సర్వే అంటూ హైలెట్ చేసింది. ఇందులో వైసీపీకి ఏకపక్ష విజయం లభించినట్లు… రాసేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఆ వెబ్ సైట్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు… తన సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటించారు. ఇప్పటికే ఫేక్ న్యూస్ విషయంలో వెబ్ సైట్లపై చాలా తీవ్ర ఒత్తిడి ఉండటంతో… ఉన్న పళంగా.. వివరణ ఇచ్చిన దరువు వెబ్ సైట్ నిర్వాహకులు… తాము కల్పిత వార్త సృష్టించామని… లెంపలు వేసుకుని వివరణ ఇచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడు వివరణ ఇచ్చింది కానీ.. ఈ దరువు.. వైసీపీకి, జగన్ కు అనుకూలంగా వేసే దరువు భీకరమైన శబ్దంతో ఉంటూనే ఉంటుంది.

ఇవే కాదు… కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే మీడియా… కాంగ్రెస్ కు ఎడ్డ్ ఇస్తూ.. బీజేపీకి అనుకూలగా ఉండే మీడియా బీజేపీకి ఎడ్జ్ ఇస్తూ.. సర్వేలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాయి. ఈ మీడియా సంస్థల తీరు వల్ల … ప్రజలు ఏ సర్వేనీ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీల మెప్పు కోసం.. మీడియా సంస్థలన్నీ తమ క్రెడిబులిటికీ కూడా విలువ కట్టుకుంటున్నాయి. ఫలితంగా… సర్వేలనేవి రియాల్టీ న్యూస్ షోలుగా మారిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close