‘బొమ్మ‌రిల్లు’ టైపులో ఫ్యామిలీ సాంగ్‌!

‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ ది ఎప్పుడూ ఫ్యామిలీ ట‌చ్చే.  ల‌వ్ స్టోరీల్ని కుటుంబ ప్రేక్ష‌కులకు న‌చ్చేలా తీస్తుంటాడు. బొమ్మ‌రిల్లుతో ఫ్యామిలీ ద‌ర్శ‌కుడిగా ముద్ర ప‌డింది. ప‌రుగు ఓకే అనిపించుకుంది. ఆరెంజ్ బాక్సాపీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టినా – అందులో పాట‌లు సూప‌ర్ హిట్టు. ఆ మాట‌కొస్తే బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌సినిమాలో పాట‌ల‌న్నీ బాగుంటాయి. ఇప్పుడు అఖిల్‌తో  ఓ సినిమా చేస్తున్నాడు. అదే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’. ఈ సినిమాలో పాట‌ల‌పై కూడా భాస్క‌ర్ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రాబోతోంది. గోపీ సుంద‌ర్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ని సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించాడు. ఈ పాట‌లో సినిమాపై క్రేజ్ పెరుగుతుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

అయితే ఈ సినిమాలో ఓ ఫ్యామిలీ సాంగ్ ఉంద‌ట‌. ఆ పాట మ‌రింత బాగా వ‌చ్చింద‌ని, ట్యూన్‌, సెట్యువేష‌న్ ఇవ‌న్నీ బాగా కుదిరాయ‌ని టాక్‌.  శ‌నివారం నుంచి హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్న శంక‌ర‌ప‌ల్లిలో ఈ పాట‌ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ పాట‌లో సినిమాలో ఉన్న ప్ర‌ధాన తారాగ‌ణం అంతా క‌నిపించ‌నుంది. దాదాపు 30 ఆర్టిస్టుల‌పై ఈ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. బొమ్మ‌రిల్లులో.. ‘లాలూ ద‌ర్వాజ కాడ‌..’ అనే ఓ పెళ్లి పాట ఉంది. ఆ త‌ర‌హాలోనే ఈ పాట కూడా సాగ‌బోతోంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close