కారు నంబర్ కోసం అంత ఖర్చు అవసరమా ఎన్.టి.ఆర్ కి ?

ఎన్టీఆర్‌కి 9వ నెంబ‌ర్ అంటే సెంటిమెంట్‌. ఎన్టీఆర్ వాడే కారు నెంబ‌ర్ ఏదైనా తీసుకోండి.. అన్నీ తొమ్మిదిలే క‌నిపిస్తాయి. 9999 అన్న‌ది ఎన్టీఆర్ ల‌క్కీ నెంబ‌ర్‌. ఇప్పుడు ఆ మోజుతోనే మ‌రోసారి ఈఫ్యాన్సీ నెంబ‌ర్‌ని చేజిక్కించుకొన్నాడు ఎన్టీఆర్‌. ఇటీవ‌ల ఎన్టీఆర్ ఓ కొత్త కారు కొన్నాడు. ఆ కారు నెంబ‌రు TS 09 EL 9999. ఈ నెంబ‌రు కోసం ఏకంగా రూ.10.5 ల‌క్ష‌లు వెచ్చించాడు ఎన్టీఆర్‌. వేలం పాట ద్వారా ఈ నెంబ‌రుని ఎన్టీఆర్‌కి కేటాయించారు ఆర్టీఏ అధికారులు.

ఈ తొమ్మిది అంకెపై ఉన్న మ‌మ‌కారం ఇప్ప‌టిది కాద‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచీ ఉంద‌ట‌. అందుకే 9 నెంబ‌రుని ఇప్ప‌టికీ వ‌ద‌ల్లేక‌పోతున్నాడ‌ట ఎన్టీఆర్‌. అన్న‌ట్టు ఎన్టీఆర్ ఫోన్ నెంబ‌ర్ చివ‌రి నాలుగు అంకెలూ…తొమ్మిదిలే. ఈ 9పై ఎంత పిచ్చి ఉంటే మాత్రం మ‌రీ ప‌దిల‌క్ష‌లు పోయాలా? ఆడ‌బ్బుతో ఏదైనా మంచి ప‌ని చేయొచ్చుగా అని నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుస‌గుస‌లాడుకొంటున్నారు. ఎవ‌రి పిచ్చి వాళ్ల‌కు ఆనందం.. మ‌ధ్య‌లో కాద‌న‌డానికి మనం ఎవ‌రం??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close