ఆ బిల్లులు రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే పాస్..!

వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వ చిక్కులలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఊహించుకున్నాయి కానీ… బీజేపీ పెద్దలు అంత కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటింగ్ అవసరం లేకుండా.. మూజువాణి ఓటుతో ఆమోదించేసినట్లుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో ప్రకటించేసుకున్నారు. దీంతో ఈ బిల్లును చట్ట రూపంలోకి తేకూడదని పట్టదల ప్రదర్శించిన విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు వెళ్లిన కొంత మంది సభ్యులు.. ఆ బిల్లులను చించేసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తానుకున్నది చేసేసింది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్యానికే దుర్దినం అన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. గత వారమే ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థిగా ఆర్జేడీ నేత ఉన్నప్పటికీ.. అత్యధిక పార్టీలు మద్దతు తెలుపడంతో మూజువాణి ఓటుతోనే ఆయన డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వారంలోనే అప్రజాస్వామికంగా.. ఓటింగ్ లేకుండా బిల్లులను పాస్ చేయించేసి.. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. నిజానికి రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మెజార్టీ లేదు. బీజేపీ మిత్రపక్షాలు.., ప్రతీ అంశంపై మద్దతు పలుకుతూ వస్తున్న బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా.. ఆలోచనలో పడ్డాయి. ఇలాంటి సమయంలో ఓటింగ్‌కు వెళ్లడం సురక్షితం కాదని.. బీజేపీ .. మూజు వాణి ఓటు వైపు మొగ్గు చూపింది.

ఇది అప్రజాస్వామ్యమైన ప్రక్రియ అని విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించి.. రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బిల్లుల ఆమోదం ప్రక్రియను డిప్యూటీ చైర్మన్ చేతుల మీదుగా నడిపించడానికి అంగీకరించారు. మామూలుగా చైర్మన్‌గా వెంకయ్యనాయుడు పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత బిల్లుల ఆమోదం ఆయన చేతుల మీదుగానే నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం.. వివాదాస్పద ఆమోదానికి డిప్యూటీ చైర్మన్ ను పంపారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినా.. ఓడినా పెద్ద తేడా ఉండదు.. వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close