ఇక రైతుల ఉద్యమంపై ఉక్కుపాదమేనా..!?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత మంది పోలీసులపై దాడులు చేశారు. రాళ్లేశారు. మొత్తంగా విధ్వంసం జరిగింది. హింసాత్మకం అయింది. ఇప్పటి వరకూ రెండు నెలల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ఎప్పుడూ పడని మరక పడింది. దీనిపై రైతు సంఘాలు బీజేపీ పై.. బీజేపీ నేతలు రైతు సంఘాలపై ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ మద్దతుదారులు.. రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ప్రచారం ఉద్ధృతంగా ఉంది. అయితే… దాడులు దిగిన వారితో.. రైతులకు ఏం సంబందం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ విధ్వంసం వెనుక దీప్ సిద్ధూ అనే పంజాబీ సింగర్, యాక్టర్ కీలకంగా వ్యవహరించారు. ఆయన బీజేపీ ఎంపీ సన్నిడియోల్ కు సన్నిహితుడు. గతంలో మోడీతో కలిసి ఫోటోలు కూడా దిగారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవి హైలెట్ అవుతున్నాయి.

ఎవరు చేసినా.. ఏం చేసినా… నింద మాత్రం రైతుల మీద పడింది. రైతులు కట్టు తప్పారని .. ఎర్రకోటపై దాడికి వెళ్లి దేశానికి చెడ్డపేరు తెచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న రైతులను ఎలాగైనా వెనక్కి తగ్గేలా చేయడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసింది. రైతు సంఘాల నేతలైప ఎన్‌ఐఏ కేసులు కూడా పెట్టినంత పని చేసింది. అయితే ఏ ఒత్తిడికీ వారు తలొగ్గలేదు. చివరికి ఏడాదిన్నర పాటు చట్టాలు అమలు నిలిపివేస్తామని ఆఫర్ ఇచ్చారు. అయినా తగ్గలేదు. రైతులు పోరాట పటిమ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రానికి ర్యాలీ హింసాత్మకం ద్వారా ఓ పదునైన కారణం దొరికిందన్న ప్రచారం సాగుతోంది.

రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం కేంద్రానికి పెద్ద విషయం కాదు. అది జాతీయ సమస్య అవుతుందన్న కారణంగానే… సెంటిమెంట్‌గా మారితే రాజకీయంగా సమస్య వస్తుందన్న కారణంగానే నిలిపివేశారు. రైతుల ఉద్యమానికి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హింస.. వారికి కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది. రైతుల ఉద్యమంపై ఇప్పటికే నెగెటివ్ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా దాన్ని మరింత పెంచేచాన్స్ ఉంది. ఆ తర్వాత కేంద్రం రైతు ఉద్యమంపై ఉక్కుపాదం మోపి అణిచేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. రైతుల పోరాటం ఎంత స్థాయిలో ఉంటుందో… అంచనా వేయడం కష్టమే. ఎవరు చేసినప్పటికీ.., ర్యాలీలో హింస రైతులకు ఇక్కట్లు తెచ్చి పెట్టబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close