కాశ్మీర్ మాజీ సీఎం కండకావరం !

భారత దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. అందుకే, భారత్ దేశాన్ని కించపరుస్తూ, పాకిస్తాన్ ను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను పొగుడుతూ మాట్లాడిన వాళ్లు ఇంకా జైళ్లలో కాకుండా మన మధ్యే తిరుగుతున్నారు. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా వరసగా పిచ్చి పిచ్చిగా జాతి విద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది కాదు వాళ్లదే అని నిన్న నోటి దురుసుతో వ్యాఖ్యానించాడు. ఇవాళ పిచ్చి ముదిరినట్టుంది. భారత దేశంలోని సైన్యం మొత్తం కాశ్మీర్ కు వచ్చినా ఉగ్రవాదులను ఎదుర్కోలేరంటూ వింత వాదన చేశాడు. అంటే, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హీరోలు, మన సైనికులు జీరోలు అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.

వేరే దేశంలో ఇలా జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఈపాటికి బొక్కలో వేసేవారు. మన దేశంలో సహనం ఎక్కువ కాబట్టి ఇంకా ప్రభుత్వం సహిస్తోంది. అయినా, అసహనం పెరుగుతోందని తిక్క తిక్కగా మాట్లాడే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

గత రెండు వారాలుగా దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులు సైనికులపై దాడులు చేస్తున్నారు. మన వాళ్ల చేతిలో ఖతం అవుతున్నారు. తంగ్ ధార్, కుప్వారా ప్రాంతాల్లో తాజాగా గురువారం కూడా ఆర్మీ పోస్టుపై దాడి చేసిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మూడు నాలుగు గంటల్లో వేటాడి మరీ కాల్చి చంపారు. అంతోటి ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఇండియా మొత్తం నుంచి సైనికులు వచ్చినా సరిపోరంటూ ఫరూక్ చేసిన కామెంట్ నిస్సందేశంగా దేశ ద్రోహమే. ప్రజల్లో భయాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ని అరెస్టు చేయవచ్చు. అయినా ప్రభుత్వం సహనం వహించడం ఫరూర్ అదృష్టం.

కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే ఓ దుకాణం ఆయనకుంది. అది ఆయన తండ్రి స్థాపించిన పార్టీ. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. పీడీపీ అదికారంలోకి వచ్చింది. అనూహ్యంగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. వీటిని ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అనిపిస్తోంది. తనకా వయసు మీరింది. మరో పది, ఇరవై ఏళ్ల దాకా పార్టీ అధికారంలోకి రాకపోతే తన కొడుకు పదవికి దూరంగా ఉండాలా అనేది ఫరూక్ బెంగ కావచ్చు. అందుకే, వేర్పాటు వాదులకు, పాకిస్తాన్ కు, దేశద్రోహులకు మద్దతుగా మాట్లాడటం ద్వారా పార్టీ పట్టు పెంచుకోవడానికి ఫరూక్ ఇలా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. కారణం ఏదైనా, ఆయన కండకావరంపై కాశ్మీర్లోనే పీడీపీ సహా అనేక పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close