ఫెడరల్ ఫ్రెంట్ కి వంద సీట్ల‌ని కేటీఆర్ జోస్యం..!

కేంద్రంలో మ‌న‌మే చ‌క్రం తిప్పుతాం, ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క‌మౌతాం, మ‌నం చెప్పిన‌వారే అధికారంలోకి వ‌స్తారు, ఇదే అజెండాతో 16 మంది తెరాస ఎంపీల‌ను గెలిపించాల‌ని కేటీఆర్ కోరారు. క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. మోడీ వ‌ల్ల దేశం బాగుప‌డ‌ద‌ని గ‌త ఐదేళ్ల‌లో స్ప‌ష్ట‌మైపోయింద‌నీ, అందుకే దేశ ప్ర‌జ‌లు ఈసారి భాజ‌పాకి మ‌రో అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక్కో రాష్ట్రంలో భాజ‌పా అధికారం కోల్పోతూ వ‌స్తోంద‌న్నారు. కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా అలానే ఉంద‌నీ, రాహుల్ గాంధీ ఏమీ చెయ్య‌లేరంటూ ఎద్దేవా చేశారు. దేశ‌వ్యాప్తంగా వివిధ స‌ర్వేలు చూస్తుంటే ఎన్డీయే, యూపీయే ఈ రెండు కూట‌ముల‌కు 150 నుంచి 180 ఎంపీ సీట్ల‌కు మించి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్నారు. చివ‌రికి ఆ రెండూ క‌లిసినా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు.

16 ఎంపీ స్థానాలు సాధిస్తే ఢిల్లీలో ఎవ‌రు గ‌ద్దెని ఎక్కాల‌నేది మ‌న‌మే నిర్ణ‌యిస్తామ‌న్నారు కేటీఆర్. దేశ‌రాజ‌కీయాల్లో ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ కీల‌కం అవుతుంద‌న్నారు. భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌న్నీ క‌ల‌వ‌బోతున్నాయ‌నీ, నాయ‌కులంద‌రితోనూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ట‌చ్ లో ఉన్నార‌ని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ మేథో సంప‌త్తిగ‌ల నాయ‌కుడ‌ని, తెలంగాణ‌లో ఆయ‌న అందిస్తున్న‌ పాల‌న‌ను దేశ‌వ్యాప్తంగా ఆద‌ర్శంగా తీసుకుంటుంద‌ని అన్నారు. పొర‌పాటున కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో ఒక‌టో రెండో ఎంపీ సీట్లు వ‌చ్చినా ఉప‌యోగం లేద‌నీ, ఢిల్లీకి గులాం గిరీ చేసే పార్టీ అని విమ‌ర్శించారు. లోక్ స‌భ‌లో తెలంగాణ బిడ్డ‌లు ఉండాలంటూ త‌న ప్ర‌సంగానికి సెంటిమెంట్ యాంగిల్ కూడా జోడించారు.

కేసీఆర్ నేతృత్వంలోని ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ను చూపించి, 16 ఎంపీ సీట్లు గెలిపించాల‌ని కేటీఆర్ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాస్త‌వానికి, ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ప్ర‌య‌త్నాల్ని కేసీఆర్ ఆపేసి చాలారోజులైంది. జాతీయ నేత‌ల‌తో కేసీఆర్ ట‌చ్ లో ఉన్నార‌ని కేటీఆర్ అంటున్నారుగానీ, కేసీఆర్ ట‌చ్ లోకి వెళ్లిన ఏ జాతీయ నేత కూడా, ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ కి సానుకూలంగా స్పందించ‌లేదు. మూడో ప్ర‌త్యామ్నాయంపై భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీలు ఎక్క‌డున్నాయి? ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఉంటుందో లేదో, దాన్లోకి రాబోయే పార్టీలు ఏవో తెలీదుగానీ, ఆ అదృశ్య కూట‌మికి 100 ఎంపీ సీట్లు వ‌చ్చేస్తాయని చెప్ప‌డం మ‌రీ విడ్డూరం! లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా సెంటిమెంట్ తోనే ఎంపీ స్థానాల‌ను గెలుచుకునే వ్యూహంతో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close