పవన్ అభిమాని హత్య…ఎన్టీఆర్, పవన్ వెంటనే స్పందించాలి

అభిమానం హద్దులు దాటుతోంది. సినిమా స్టార్లు కూడా ఆ అభిమానాన్ని ఇంకొంచెం రెచ్చగొడుతున్నారు. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ అంటున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్తున్నారు. పాదాభివందనం చేస్తామంటున్నారు. ది బెస్ట్ డైలాగ్ రైటర్స్‌తో వర్క్ చేస్తున్న ఈ స్టార్స్ అందరూ, ఆడియో వేడుకల్లో కూడా, అదే రైటర్స్ చేత ఎఫెక్టివ్ డైలాగ్స్ రాయించి మరీ సూటిగా అభిమానుల మనసుల్లోకి వెళ్ళేలా ఆ డైలాగులు వల్లె వేస్తున్నారు. సినిమాల్లో నటించేటప్పుడైనా కొన్ని సార్లు ఫెయిల్ అవుతున్నారేమో కానీ ఆడియో రిలీజ్ వేడుకల్లో నటించేటప్పుడు మాత్రం ఎవ్వరికీ ఎవ్వరూ తీసిపోవడం లేదు.

ఆ విషయం పక్కన పెడితే ఆ మధ్య పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన గొడవ గుర్తుంది కదా. మీడియా చూపించిన అత్యుత్సాహంతో, ఫేస్ బుక్, వాట్సాప్‌ల పుణ్యమాని కార్చిచ్చులా రగిలిన ఆ గొడవ 144 సెక్షన్‌కి కూడా దారితీసింది. ఆ ఇద్దరు స్టార్స్ మాత్రం నింపాదిగా ఆ తర్వాతెప్పుడో స్పందించారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ సారి ఓ యువకుని ప్రాణం పోయింది. మళ్లీ సోషల్ మీడియాలో మంటలు రేగుతున్నాయి. అంతా అయిపోయాక అభిమానుల బెయిల్ కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు పంపించి…ఇంకొంచెం రెచ్చగొట్టే యాక్టివిటీస్ లాంటివి చేయకుండా పవన్, ఎన్టీఆర్‌లు వెంటనే రియాక్టవ్వాలి. అసలే త్వరలో జనతా గ్యారేజ్ రిలీజ్ కూడా ఉండడంతో ఈ గొడవలు మరింతగా పెరుగుతూ పోయే అవకాశం ఉంది. అందుకే ఈ ఇద్దరు స్టార్స్‌కి ఏ మాత్రం అభిమానులపై ప్రేమ ఉన్నా కనీసం సోషల్ మీడియాలో అయినా స్పందించాలి. మరింత నష్టం జరగక ముందే స్పందించాలి. నిండా మూడు పదుల వయసు కూడా లేని యువకుడు చనిపోతే ఆ కుర్రాడి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఏ స్టార్ హీరో కూడా ఆ లోటును పూడ్చలేడు.

స్టార్ హీరోలందరికీ కూడా ఫ్యాన్ బేస్ కావాలి. వాళ్ళ సినిమాలకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కావాలి. వాళ్ళ మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ పోవడానికే అభిమానులు అవసరం. అలా పెరగాలంటే ఓ రెండు సెంటిమెంట్ డైలాగులు చెప్పాలి కాబట్టి చెప్తుంటారు. అంతే గానీ ఏ స్టార్ హీరోకి కూడా ఆయన కెరీర్, ఆయన ఫ్యామిలీ, ఆయన సినిమాల కంటే అభిమానులు ఎప్పటికీ ఎక్కువ కారు. అయినా వాళ్లు మంచి సినిమాలు తీస్తున్నారు. మనం ఆదరిస్తున్నాం. అంతవరకే అభిమానం ఉంటే అందరికీ మంచిది.

అసలు ఈ స్టార్ హీరోస్‌కి నిజంగా అభిమానులపైన ఎలాంటి పీలింగ్స్ ఉంటాయి? వేలాదిమంది అభిమానులు ఆ స్టార్ హీరోస్‌ని చూడడం కోసమే ఎగబడడం గురించి ఆ స్టార్ హీరోలు ఎంత కామెడీగా మాట్లాడుకుంటారు. ఆ మొత్తం వ్యవహారమంతటినీ చూస్తూ వాళ్ళు ఎంత బ్యాడ్‌గా కామెంట్స్ చేస్తుంటారు లాంటివన్నీ సీనియర్ జర్నలిస్ట్స్ చాలా మందికి తెలిసిన విషయాలే. కానీ అలాంటి విషయాలు రాస్తే ఆ స్టార్ హీరోలకంటే కూడా ముందు అభిమానులే ఒప్పుకోవడం లేదు. అందుకే ఏ సీనియర్ జర్నలిస్ట్ కూడా అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. గుడ్డి అభిమానాన్ని, మూర్ఖపు అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే అభిమానుల గురించి హీరోలు చెప్పే డైలాగులకు, వాళ్ళ చేతలకు ఎంత తేడా ఉంటుందో ఎవ్వరికైనా అర్థమయిపోతుంది.

వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఒకటే. అందరి ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్‌కి అందరూ వెళతారు. పబ్‌లు, టూర్లు అంటూ అందరూ కలిసే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోలు ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు కూడా అందరు స్టార్స్ అటెండ్ అవుతూ ఉంటారు. కళ్ళు తెరిచి వాస్తవాలను చూడండి. ఇంటర్నెట్ యుగంలో ఏ విషయాన్నీ ఎవ్వరూ దాచలేరు. తొంభై శాతం హీరోలు ఒకళ్ళకొకళ్ళు మంచి ఫ్రెండ్స్ అన్నమాట వాస్తవం. అందరూ కూడా అన్ని సినిమాలకూ మంచి కలెక్షన్స్ రావాలనే కోరుకుంటూ ఉంటారు. అభిమానులే ఆలోచనలేకుండా అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటూ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. ఫ్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న పేరెంట్స్‌కి, సన్నిహితులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close