‘ఫైట‌ర్’ టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదా?

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఈ రోజే ప‌ట్టాలెక్కింది. ముంబైలో ఈ రోజు క్లాప్ కొట్టేశారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌కటించింది. అయితే టైటిల్ మాత్రం చెప్ప‌లేదు. ఈ సినిమాకి ‘ఫైట‌ర్’ అనే టైటిల్ పెట్టిన‌ట్టు ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. పూరి మ‌న‌సులోనూ ఫైట‌ర్ టైటిల్ ఫిక్స‌య్యింది. కానీ ఈ రోజు మాత్రం టైటిల్ చెప్ప‌లేదు.

దానికి కార‌ణం.. అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాని `ఫైట‌ర్` పేరుతోనే విడుద‌ల చేద్దామ‌ని చూస్తున్నారు. తెలుగులో టైటిల్ దొరికేసింది. అయితే మిగిలిన భాష‌ల్లో మాత్రం టైటిల్ దొర‌క‌డం లేద‌ని స‌మాచారం. అన్ని భాష‌ల్లోనూ టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేశాకే.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఫైట‌ర్ పేరుతో టైటిల్ రిజిస్ట‌ర్ అయ్యి ఉంది. ఆయా నిర్మాత‌ల‌తో మాట్లాడి టైటిల్ తీసుకోవాల‌ని పూరి భావిస్తున్నాడు. ఆ టైటిల్ క్లియ‌రెన్స్ వ‌చ్చాకే… ‘ఫైట‌ర్‌’గా అఫీషియ‌ల్‌గా డిక్లేర్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే టైటిల్‌ని ఇంకా దాచి పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close