హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీల విప్లవం రానుంది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఫిల్మ్ స్టూడియోలు నిర్మించడానికి ఒప్పందాలు జరిగాయి. ఫిల్మ్ సిటీలకు సంబంధించి, సమ్మిట్‌లో “ఫిల్మ్ ఇన్ తెలంగాణ” సెషన్ జరిగింది. తెలంగాణను భారతదేశంలోని క్రియేటివ్ ఎకానమీలో ముందుంచేందుకు చర్చలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ సిటీల అభివృద్ధికి రెండు పెద్ద ఒప్పందాలు జరిగాయి. ఇవి బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్లకు సంబధించినవి. ఇవి హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చడానికి సహాయపడతాయి.
హైదరాబాద్లోస్టూడియో నిర్మాణానికి అజయ్ దేవగణ్ ఆసక్తి
అజయ్ దేవ్‌గణ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ అభివృద్ధి. VFX, స్మార్ట్ స్టూడియో సౌకర్యాలు, కట్టింగ్-ఎడ్జ్ ప్రొడక్షన్ కెపాబిలిటీలు ఉంటాయి. అజయ్ దేవ్‌గణ్ రైజింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ రూ.10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది.
అన్నపూర్ణ స్టూడియో కూడా !
అన్నపూర్ణ స్టూడియోను కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని నాగార్జున ప్రకటించారు. పూర్తి గా తరలిస్తారా లేకపోతే అక్కడ కొత్తది నిర్మిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. విశాలమైన స్టూడియోను నిర్మించాలన్న ఆలోచనలోనాగార్జున ఉన్నారు. కేవలం స్టూడియో మాత్రమే కాకుండా.. మారుతున్న నిర్మాణ అవసరాలకు తగ్గ అత్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పా టు చేసే ఆలోచనలో ఉన్నారు.
అన్నీ నిర్మాణం అయితే.. ఇక కంటెంట్ కింగ్ హైదరాబాద్
ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ అటు పర్యాటకుల్ని.. ఇటు సినిమా ప్రొడ్యూసర్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. అక్కడ షూటింగులు రోజుకు నాలుగుదై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇతర భాషల వాళ్లు కూడా వస్తూంటారు.ఇప్పుడు. ఒప్పందాల్లో భాగంగా.. బాలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ హీరోలు నిర్మాణాలు పూర్తి..ఇక హైదరాబాద్ కంటెంట్ కింగ్ గా మారుతుంది. ఎలాంటి కంటెంట్ అయినా తీయడానికి ఇక్కడికే వస్తారని అనుకోవచ్చు.
