రోహిత్ కులంపై ఎట్టకేలకు వీడిన మిస్టరీ!

హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఒకవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు అతని కులంపై సమాంతరంగా ఒక చర్చ జరుగుతోంది. అసలు అతను దళితుడే కాదని, వడ్డెర కులం వాడని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మందు బాబు అని స్పష్టంగా కనబడుతున్న రోహిత్ తండ్రి మణికుమార్‌తో కూడా చెప్పిస్తున్నాయి. అయితే ఈ చర్చలో పడి అసలు సమస్య రోహిత్ కులం కాదన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోతున్నారు. ఒకవేళ రోహిత్ వడ్డెర అయినాకూడా, చనిపోయేవరకు అతను తనను తాను దళితుడిగానే భావిస్తున్నాడు….దళితుడిగానే యూనివర్సిటీలో అందరికీ తెలుసు. సస్పెన్షన్‌కు గురైన మిగిలిన నలుగురూ కూడా దళితులే. సుశీల్ కుమార్‌పై ఏడుగురు దాడిచేశారని విచారణ కమిటీ తేల్చినప్పటికీ వారిలో దళితులైన ఈ ఐదుగురిపైనే సస్పెన్షన్ వేటు వేశారు. సుశీల్‌ను విచక్షణారహితంగా ఈ ఏడుగురూ కొట్టారన్న ఆరోపణల్లో నిజంలేదని పోలీసులతో పాటు యూనివర్సిటీ అధికారులు కూడా హైకోర్టుకు తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. కాబట్టి ఇక్కడ సమస్య రోహిత్ కులం కాదు. దళితులపై వివక్ష చూపటం, విచారణ నిష్పక్షపాతంగా జరగకపోవటంవలన అతను మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు కనుక సమస్య యూనివర్సిటీలోని మేనేజ్‌మెంట్‌లో లోపాలు, క్యాంపస్ పాలిటిక్స్‌లోనే ఉంది.

ఇదిలా ఉంటే రోహిత్ విషయంలో ఇంత దుమారం రేగినా కూడా తెలుగు పాత్రికేయులెవరూ చేయలేని ఒక పనిని హిందూస్తాన్ టైమ్స్ అనే జాతీయ దినపత్రిక ప్రతినిధి ఒకరు చేశారు. రోహిత్ కులం వెనక ఉన్న రహస్య కోణాన్ని పరిశోధించి బయటపెట్టారు. రోహిత్ ఎస్‌సీ మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తేనని నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో పర్యటించి రోహిత్ కుటుంబ మూలాలలోకి వెళ్ళి సమాచారాన్ని రాబట్టుకున్నారు.

రోహిత్ తల్లి రాధిక పుట్టుకతో ఎస్‌సీ మాల సామాజికవర్గానికి చెందినవారే. అయితే ఆమెను వడ్డెర కులానికి చెందిన ఒక కుటుంబం దత్తతకు తీసుకుంది. ఆ కుటుంబానికి చెందిన అంజనీదేవి ఆ వివరాలను హిందూస్తాన్ టైమ్స్ విలేకరికి తెలిపింది. 1971లో తమ ఇంటి ఎదురుగా కొందరూ కూలిపనులు చేస్తున్నారని వారిలో ఒక జంటకు చెందిన చిన్నపిల్ల ముద్దుగా ఉండటం చూసి ముచ్చటపడి తమకు ఇవ్వమని అడిగితే ఆ జంట సంతోషంగా ఇచ్చేశారని తెలిపారు. ఆ పాప తల్లిదండ్రులు ఎస్‌సీ మాల సామాజికవర్గంవారని వెల్లడించారు. ఆ పాపే రాధిక అని, ఆమెను తాము పెంచి పెద్ద చేశామని, తమ సామాజికవర్గానికే చెందిన మణికుమార్‌కు ఇచ్చి పెళ్ళిచేశామని చెప్పారు. అయితే మణికుమార్‌ కుటుంబానికి రాధిక కులం విషయం చెప్పలేదని తెలిపారు. మణికుమార్ మొదటినుంచీ బాధ్యతారహితంగానే ప్రవర్తించేవాడని, కొంత కాలానికి రాధిక కులం రహస్యం తెలియటంతో రాధికను కొట్టటంకూడా ప్రారంభించాడని చెప్పారు. ఒక అంటరానిదానితో తనకు పెళ్ళిచేసి మోసం చేశారంటూ క్రూరంగా ప్రవర్తించేవాడని తెలిపారు. రాధికను 1990లో తనదగ్గరకు తెచ్చేసుకున్నానని చెప్పారు.

మరోవైపు రాధికను పెంచిన అంజనీదేవి ఆమెపట్ల సరిగా ప్రవర్తించేది కాదని హిందూస్తాన్ టైమ్స్ విలేకరి పరిశోధనలో తేలింది. ఆమె సొంత కుమార్తెలాగా రాధికను ఏనాడు చూడలేదని రోహిత్ మిత్రులు చెప్పారు. రాధిక, ఆమె పిల్లలు ఆ ఇంట్లో పనివాళ్ళలాగా పనులు చేసినట్లు బయటపడింది. రోహిత్ గానీ, అతని సోదరుడు రాజా గానీ మెరిట్ స్టూడెంట్స్ అని తేలింది. అయితే వారిద్దరి పై చదువులకోసం అంజనీదేవి ఏనాడు సాయం చేయలేదని, వారిద్దరూ అనేక పనులు చేస్తూ డబ్బు సంపాదించుకుని, ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదువుకున్నారని బయటపడింది. ఇప్పుడు రోహిత్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేటప్పటికి అంజనీదేవి ఇప్పుడు హైదరాబాద్‌లో రాధికవద్దకు వచ్చి ఆమె పక్కనే ఉంటుండటం విశేషం. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలోని ఒక దళిత ప్రొఫెసర్ ఇంట్లో తలదాచుకుంటున్న రాధికవద్దే అంజనీదేవి ఉంటున్నారు. రాధిక, ఆమె పిల్లలు ముగ్గురిపట్ల వివక్ష ప్రదర్శించటంపై హిందూస్తాన్ టైమ్స్ విలేకరి ప్రశ్నించగా అంజనీదేవి సరిగా సమాధానమివ్వకుండా దాటవేశారు. మొత్తంమీద చూస్తే రోహిత్ ఎస్‌సీ మాల సామాజికవర్గంవాడేనన్న విషయం ఖరారయింది. అందుకే రోహిత్ సోదరుడు రాజా అంత నమ్మకంగా తమ సర్టిఫికెట్‌‌ను బయటపెట్టినట్లు తెలుస్తోంది. దానికి తోడు తాను దత్తతకు వెళ్ళానని రోహిత్ తల్లి రాధిక ఇటీవల చెప్పిన విషయం హిందూస్తాన్ టైమ్స్ కథనంతో సరిపోవటాన్ని కూడా గమనించొచ్చు. చిన్ననాటినుంచి తల్లే పైకి తీసుకొచ్చింది కాబట్టి రోహిత్, అతని సోదరుడు ఎస్‌సీగా ప్రకటించుకుని ఉండొచ్చు. అయితే హెచ్‌సీయూలో సీటు పొందటానికిగానీ, సీఎస్ఐఆర్ స్కాలర్‌షిప్ రెండుసార్లు పొందటానికిగానీ రోహిత్ ఎస్‌సీ సర్టిఫికెట్ పెట్టుకోలేదన్నది తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close