మోదీ మాటల్లోనే టీమిండియా స్ఫూర్తి..! అన్నీ రాష్ట్రాలపై కుట్రలే..!!

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టగానే… దేశం మొత్తం గర్వించే మాటలు చెప్పారు. రాష్ట్రాలన్నీ కలిపితేనే టీమిండియా అన్నారు. టీమ్ ఇండియా పేరుతో ఒకటి, రెండు సార్లు పెద్ద సమావేశాలే నిర్వహించారు. రాష్ట్రాల కడుపు నింపే మాటలు చెప్పారు. అందరూ నిజమేననుకున్నారు. కానీ రాను రాను మబ్బులు వీడిపోయాయి. కెప్టెన్‌గా పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోదీ.. ఆటగాళ్లందర్నీ బలహీనం చేసి తన కెప్టెన్సీని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనుమానాలు పెరిగిపోయాయి. అందులోనూ తన చెప్పు చేతల్లో ఉండే రాష్ట్రాలకు ప్రయోజనాలు.. తనకు పోటీ అవుతారు, వ్యతిరేకిస్తారనుకున్న వారికి కోతలు వేస్తూ… తాను చెప్పిన టీమ్ ఇండియా స్ఫూర్తికే జెల్లకొట్టారు. ఆ ఫలితం ఇప్పుడు దెబ్బతింటున్న టీమ్ మెంబర్స్ రోడ్డెక్కెలా చేసింది.

అమరావతిలో జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో … వంద శాతం ఇదే అభిప్రాయం వ్యక్తమయింది. రాష్ట్రాలను నిర్వీర్యం చేసి.. కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడానికే.. మొదటి నుంచి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి …దేశానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అంతర్గతంగా ఉన్న లక్ష్యం రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే. ప్రణాళికా సంఘానికి నిధులు కేటాయించే అధికారం ఉండేది. తన విచక్షణతో… ఏయే రంగాలకు… ఏయే రాష్ట్రాలకు కేటాయించాలో కేటాయించేవారు. కానీ నీతిఆయోగ్ విషయంలో మాత్రం… ప్రధాని మోదీ… ఆ ఒక్క అధికారాన్ని తన వద్దే ఉంచేసుకున్నారు. దీని వల్ల.. మూడు లక్షల కోట్ల రూపాయల వరకు.. తన సొంత విచక్షణతో రాష్ట్రాలకు సొమ్ములు కేటాయించుకునే అవకాశం వచ్చింది.

ఇప్పుడు పదిహేనో అర్థిక సంఘం పేరుతో రాష్ట్రాల జుట్టును పూర్తిగా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నుల వాటాను తగ్గించడం దగ్గర్నుంచి కేంద్ర పథకాల నిధులు, 2011 జనాభా ప్రాదిపదికన నిధుల కేటాయింపు సహా… అనేక అంశాలు… బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే….ఉపయోగపడేలా ఉన్నాయి. మిగతా.. ఇండియా టీమ్‌లోని రాష్ట్రాలను … ఆర్థిక సమస్యల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ప్రధాని నియమించిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లోని వారు..దీనిపై నోరు మెదపలేరు. నోరు మెదిపిన రాష్ట్రాలను లెక్కలోకి తీసుకునే విచక్షణ ప్రధానికి లేదు. అందుకే మోదీ చెప్పిన ఫెడరల్ స్ఫూర్తి ప్రమాదంలో పడింది. టీమ్ ఇండియా ఐక్యమత్యాన్ని దెబ్బతీస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close