అక్బరుద్దీన్ స్పీచ్ పై కలకలం

బిహార్ లో ఎన్నికల ప్రచారసభలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకరిపైమరొకరు వ్యక్తిగత దాడులకు దిగడం కూడా ఎక్కువైంది. ఇదంతా ఒకఎత్తైతే, ఏఐఎంఐఎం (మజ్లీస్ పార్టీ) శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పీచ్ తో పెద్దఎత్తున కలకలం చెలరేగింది. బిహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలోని కోచంద్మాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీ అభ్యర్థి అఖ్తరుల్ బరిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఈ నియోజకవర్గం పరిధిలోని సోన్తాహత్ గ్రామంలో జరిగిన ర్యాలీలో అక్బరుద్దీన్ ఒవైసీ అన్యమతస్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఆయన స్పీచ్ ప్రభావంతో రెండు ఆలయాల్లో కాళీమాత విగ్రహాల ధ్వసం జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఒక శాసనసభ్యుడి హోదాలో ఉంటున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయి తోటి గౌరవసభ్యులను తూలనాడినట్లు ఆరోపణ ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ గ్రామంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసి) క్రింద 144వ సెక్షన్ అమలులోఉంది. అయితే ఈ సెక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్బరుద్దీన్ ప్రసంగం సాగినట్లు ఫిర్యాదురావడంతో పోలీసులు ఈయనపై రెండు సెక్షన్ల క్రింద ఎఫ్.ఐఆర్ ఫైల్ చేశారు.

ఇండియన్ పీనల్ కోడ్ క్రింద 153 ఎ, 188 సెక్షన్ల క్రింద కేసులు బుక్ అయ్యాయి. మతం, జాతి, పుట్టుక, ఆవాసం, భాష వంటి విషయాల్లో సామరస్య పోకడ దెబ్బతినేలా ప్రసంగించడం, లేదా ప్రవర్తించడం వంటి అభియోగాలపై 153 ఏ సెక్షన్ క్రింద కేసు పెడుతుంటారు. ఇక, ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ అందుకు భిన్నంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తిపై 188 సెక్షన్ పై కేసు పెడుతుంటారు. అక్బరుద్దీన్ విషయంలో మెజిస్ట్రేట్ రిపోర్ట్ ఆధారంగా ఈ రెండు సెక్షన్ల క్రింద ఎఫ్.ఐఆర్ నమోదైనట్లు పోలీస్ సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ చెప్పారు.

అక్బరుద్దీన్ తన ఘాటైన ప్రసంగంలో తన సోదరుడైన అసదుద్దీన్ ఒవైసీ మినహా మిగతా ఎంపీలపై దుర్భాషలాడినట్లు ఆరోపించబడింది. అలాగే బీజేపీ నాయకులపై కూడా విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోదీని సైతాన్ అంటూ దూషించారు. బాబ్రీమసీద్ కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అసమర్థతవల్లనే మోదీ ప్రధాని సీట్లో కూర్చున్నారని వ్యాఖ్యానించారు.

ఇది ఇలాఉంటే, నేపాల్ ఘడ్ అనేచోట రెండు దేవాలయాల్లో ఉన్న కాళీ మాత విగ్రహాలను రాత్రికిరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. పక్కపక్కనే ఉన్న ఈ రెండు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనట్లు సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని విచారణ చేపట్టారు. అక్బరుద్దీన్ ప్రసంగానికీ, విగ్రహాల ధ్వంసానికీ సంబంధం ఏదైనా ఉన్నదా? అన్న కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు తెలిసింది.

అక్బరుద్దీన్ ఏ సభలోనైనా చాలా ఘాటుగానే మాట్లాడతారు. రెచ్చగొట్టే ధోరణిలో గతంలో కూడా ప్రసంగించిన దాఖలాలున్నాయి. పైగా ఇప్పుడు ఎన్నికలు కావడంతో ఈ ధోరణి ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది.
బహిరంగసభల్లో మతపరంగా రెచ్చగొట్టడం, గోవధ, ఆవుమాంసం వంటి సున్నితమైన అంశాలను నడివీధికి లాగడం వంటివి చోటుచేసుకోవడం ఈమధ్య ఎక్కువైంది. చివరకు ఇది ఎటుదారితీస్తుందోనని ప్రజాస్వామ్య ప్రియులు ఆందోళనచెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close