కేరళ ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు!

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మరియు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అర్యదన్ మొహమ్మద్ లపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయవలసిందిగా త్రిసూర్ విజిలన్స్ కోర్టు ఇవ్వాళ్ళ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. సరిత ఎస్. నాయర్ అనే ఆమె తన సోలార్ ప్రాజెక్టు అనుమతుల కోసం ముఖ్యమంత్రి చాందీకి రూ.1.90 కోట్లు, అర్యదన్ కి రూ.40 లక్షలు లంచం ఇచ్చినట్లుగా కోర్టులో అంగీకరించారు.

ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారిరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించవలసిందిగా కోరుతూ పిడి జోసెఫ్ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ న్ని విచారణకు స్వీకరించిన త్రిసూర్ విజిలన్స్ కోర్టు వారిరువురిపై తక్షణమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయాధిపతి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు కూడా త్రాగక తప్పదు. నేరం చేస్తే ప్రధానమంత్రయినా ముఖ్యమంత్రయినా చట్టం ముందు అందరూ సమానులే. ఎవరికీ మినహాయింపు ఉండవు. కొన్ని అసాధారణ పరిస్థితులలో న్యాయస్థానాలు కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, అని అన్నారు.

ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయిన కారణంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, మంత్రి అర్యదన్ మొహమ్మద్ ఇద్దరూ రాజీనామా చేయకతప్పదు. ఒకవేళ దానికి వారు సిద్దం కాకపోయినా ఇప్పటికే వామపక్షాల నేతృత్వంలో లెఫ్ట్ డెమొక్రిటిక్ ఫ్రంట్ నేతలు, కార్యకర్తలు వారి రాజీనామాల కోసం వారి కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అధికార యునైటెడ్ డెమొక్రేటిక్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఇటువంటి ఎదురుదెబ్బ తగలడం చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది.

కేరళ రాష్ట్రంలో రెండే రెండు బలమయిన కూటములున్నాయి. అవి యునైటెడ్ డెమొక్రేటిక్ ఫ్రంట్ (కాంగ్రెస్) మరియు లెఫ్ట్ డెమొక్రిటిక్ ఫ్రంట్ (వామ పక్షాలు). గత మూడు దశాబ్దాలుగా ఒకసారి ఒకటి, మరొకసారి ఇంకొకటి అధికారం చేజిక్కించుకొంటున్నాయి తప్ప వాటి మధ్య మూడో పార్టీని, కూటమిని ప్రవేశించనీయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అధికార యునైటెడ్ డెమొక్రేటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది కనుక ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వామ పక్షాలకు చెందిన లెఫ్ట్ డెమొక్రిటిక్ ఫ్రంట్ అధికారం చేజిక్కించుకోవచ్చును. దానికి మార్గం సుగమం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖా మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close