‘…స‌రిలేరు’ లుక్‌: లేడీ సూప‌ర్ స్టార్ ఈజ్ బ్యాక్‌

దాదాపు ఓ పుష్క‌రం అయ్యింది విజ‌య‌శాంతిని వెండి తెర‌పై చూసి. రాజ‌కీయాల్లో బిజీగా ఉండి, సినిమాల‌వైపు దృష్టి సారించ‌లేక‌పోయింది. ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా – విజ‌య‌శాంతి క‌ర‌గ‌లేదు. క‌ద‌ల‌లేదు. కానీ… ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ కోసం మాత్రం మ‌ళ్లీ రంగంలోకి దిగింది. ‘స‌రిలేరు..’లో విజ‌య‌శాంతి న‌టిస్తుంద‌ని తెలియ‌గానే ఈ సినిమాకి ఓ కొత్త లుక్‌, ఓ కొత్త క‌ల‌ర్ వ‌చ్చింది. విజ‌య‌శాంతి పాత్ర ఎలా ఉంటుంది? తెర‌పై ఎలా క‌నిపిస్తుంది? ఆమె లుక్ ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పుడు విజ‌య‌శాంతి లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాలో భార‌తి పాత్ర‌లో ఆమె క‌నిపించ‌బోతున్నారు. లుక్ చాలా కూల్‌గా, హుందాగా ఉంది. ప‌ద‌మూడేళ్ల క్రితం విజ‌య‌శాంతిని ఎలా చూశామో, అంత‌కంటే ఛార్మింగ్‌గా ఆమె లుక్ ని డిజైన్ చేశారు. ‘బాహుబ‌లి’ త‌ర‌వాత హుందాగా ఉండే పాత్ర‌ల‌కు ర‌మ్య‌కృష్ణ పేరు ఎక్కువ‌గా ప‌రిశీలించ‌డం మొద‌లెట్టారు. న‌దియా లాంటివాళ్లు ఒక‌ట్రెండు సినిమాల‌కు వ‌చ్చి వెళ్లారు. విజ‌య‌శాంతి గ‌నుక‌… ఓకే అంటే ఇప్పుడు ఆ త‌ర‌హా పాత్ర‌ల‌న్నీ ఆమె ముందు క్యూ క‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా వ‌ల్ల విజ‌య‌శాంతికి ఎంత ప్ల‌స్సో తెలీదు గానీ, విజ‌య శాంతి వ‌ల్ల మాత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కి నిజంగా ప్ల‌స్సే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close