కర్ణాటక ఎపిసోడ్‌కు ఫ్లాట్ క్లైమాక్స్..! ఓటింగ్ లేకుండానే కుమారస్వామి గెలుపు..‍‍!!

కర్ణాటక అసెంబ్లీ క్లైమాక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. ఎలాంటి మలుపులు లేవు. బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప తాను చెప్పాలనుకున్న విషయాలను అసెంబ్లీ సాక్షిగా చెప్పి.. తనకు అధికారం అందకుండా చేసినా… కాంగ్రెస్, జేడీఎస్‌లపై నిప్పులు చెరిగి… వాకౌట్ చేసేశారు. యడ్యూరప్ప ప్రసంగానికి కౌంటర్‌గా కుమారస్వామి మాట్లాడుతూండగానే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఓటింగ్ అవసరం లేకుండానే కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి గండం గడిచినట్లయింది. ఓ వైపు డి.కె.శివకుమార్ అసంతృప్తి, మరో వైపు మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్‌లో కులాల కుమ్ములట కలగలిపి.. ఏమైనా జరుగుతుందా అన్న ఉత్కంఠను కలిగించాయి. కానీ అనుమానాలన్నీ …తీరిపోయాయి. కుమారస్వామి ప్రభుత్వం కష్టపడకుండానే బలం నిరూపించుకున్నట్లయింది.

అసెంబ్లీ సమావేశమైన తర్వాత ప్రొటెం స్పీకర్ బోపయ్య… స్పీకర్ ఎంపికను చేపట్టారు. అనూహ్యంగా బీజేపీ సురేష్ కుమార్ అనే ఎమ్మెల్యేని రంగంలోకి దింపాలని నిర్ణయించడంతో ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ను కాంగ్రెస్-జేడీఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎన్నిక వరకూ వెళ్లకుండానే .. బీజేపీ తమ అభ్యర్థిని విత్ డ్రా చేసుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అన్ని పార్టీల సభ్యులు సంప్రదాయంగా స్పీకర్ ను అభినందించారు.

కర్ణాటక అసెంబ్లీ కౌంటింగ్ తేదీ అయిన మే పదిహేనో తేదీన ఏర్పడిన హైడ్రామా… 25వ తేదీ వరకు సాగింది. ఈ మధ్యలో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. యడ్యూరప్ప మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కర్ణాటకలో ఏర్పడిన పరిణామాలు.. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేశాయి. అది కుమారస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పార్టీలన్నీ బలప్రదర్శన చేశాయి. ఇప్పటికే కర్ణాటక కథ సుఖాంతమైనా… సంకీర్ణ ప్రభుత్వంలో సరిగమలు మాత్రం ఆగే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close