నాగ్ చుట్టూ ఫ్లాప్ ద‌ర్శ‌కుడి ప్ర‌ద‌క్ష‌ణ‌లు

చిత్ర‌సీమ‌లో మాట చెల్లుబాటు అవ్వాలంటే చేతిలో హిట్టు ఉండాల్సిందే. ద‌ర్శ‌కులైనా, హీరోలైనా, నిర్మాత‌లైనా.. హిట్టుకే విలువ ఇస్తారు. అందులో త‌ప్పుప‌ట్టాల్సిందేం లేదు. ఫ్లాపులుంటే ఎవ‌రినీ న‌మ్మ‌రు. ఒక‌ప్పుడు హిట్లిచ్చినంత మాత్రాన క‌నిక‌రించ‌రు కూడా.

ఒక‌ప్పుడు నాగార్జున వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు ఓ హిట్ ఇచ్చాడు ఓ ద‌ర్శ‌కుడు. ఆ సినిమాతో నాగ్ కాస్త తేరుకున్నాడు. అప్పటి నుంచీ ఆ ద‌ర్శ‌కుడంటే నాగ్ కి ఎంతో అభిమానం. ఓ ద‌శ‌లో అఖిల్ ఎంట్రీ ఆ ద‌ర్శ‌కుడితోనే చేయిద్దామ‌నుకున్నాడు. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆ దర్శ‌కుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. అవ‌కాశాల కోసం ఎంత తిరిగినా ప‌ని జ‌ర‌గ‌డం లేదు. ఆ స‌మ‌యంలో నాగార్జున గుర్తొచ్చాడు. ఓ క‌థ త‌యారు చేసుకుని.. నాగ్ చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయ‌డం మొద‌లెట్టాడు. నాగ్ తిప్పించుకుంటున్నాడు గానీ.. ఆ ద‌ర్శ‌కుడికి ఛాన్స్ మాత్రం ఇవ్వ‌డం లేదు. అలాగ‌ని `నో` అని కూడా చెప్ప‌డం లేదు. నాగ్ `నో` చెప్పినా.. క‌నీసం అఖిల్ లేదా, నాగ చైత‌న్య‌ల‌తో అయినా స‌రే, సినిమాని ప‌ట్టాలెక్కిద్దామ‌ని ఆ ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌. కానీ… నాగ్ మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. మ‌రో ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ ప‌రిస్థితీ ఇంతే. `సోగ్గాడే చిన్ని నాయిన‌` సీక్వెల్ `బంగార్రాజు` క‌థ‌తో ఏళ్ల త‌ర‌బ‌డి నాగ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ ద‌ర్శ‌కుల‌పై నాగ్ ఎప్పుడు క‌నిక‌రం చూపిస్తాడో ఏంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close