మొన్న కశ్మీర్.. నేడు ఆయోధ్య..! రాచపుండ్లకు తిరుగులేని చికిత్స..!

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి.. భారత్‌ను కశ్మీర్ సమస్య వెంటాడింది. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయం ద్వారా.. ఆ సమస్యకు పరిష్కారం చూపారు… నరేంద్రమోడీ, అమిత్ షా. అయోధ్య సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపబోతోంది. దశాబ్దాలుగా.. దేశాన్ని రెండు వర్గాల మధ్య విభజించిన సమస్య అయోధ్య. దీనిపై.. సుప్రీంకోర్టు చెప్పే తీర్పు అందర్నీ కలుపుతుందని దేశం నమ్ముతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది. రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ వివాదం మొదలైంది.

16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాట్ బాబర్ ఒక మసీదును నిర్మించాడు. అక్కడున్న హిందూ ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించారని హిందువుల వాదన. 1949లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి వరకు తాము మాత్రమే ప్రార్థనలు చేశామని, ఆ ఏడాది రాత్రి వేళ కొందరు హిందువులు గుట్టు చప్పుడు కాకుండా రాముడి విగ్రహాలు తెచ్చి పెట్టారని ముస్లింల ఆరోపణ. అప్పటి నుంచి హిందూ విగ్రహాలకు కూడా పూజలు జరుగుతున్నాయని వారు తెలిపారు. అప్పటి నుంచి హిందూ, ముస్లింల మధ్య కోర్టు కేసులు ప్రారంభమయ్యాయి. 1993 ఏప్రిల్ 3న వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు కోర్టుకెక్కారు. 1994 అక్టోబరు 24న సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మసీదు ఇస్లాంలో భాగం కాదని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని 2003 మార్చి 13న సుప్రీం కోర్టు ఆదేశించింది.

2017 మార్చి 21 సుప్రీం కోర్టు ఒక ప్రతిపాదన చేసింది. కోర్టు వెలుపల ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 2019 జనవరి 8న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్టోబరు 16న విచారణ రాజ్యాంగ ధర్మాసనం విచారణ ముగించింది. అయోధ్య తీర్పు.. ఉత్కంఠ రెకేత్తిస్తోంది. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు.. దేశ ప్రజలను.. మెప్పిస్తుందని.. బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రారంభమైన ఓ రకమైన ఉద్రిక్తతను..మళ్లీ తగ్గిస్తుందని.. జనం నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close