” టీఆర్ఎస్ ” పార్టీ పెట్టనున్న పొంగులేటి !

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద మాస్టర్ ప్లాన్‌లోనే ఉన్నారు. తనకు మంచి డీల్ ఇస్తే పార్టీలో చేరుతానని జాతీయ పార్టీలతో పాటు టీడీపీ వంటి వాటికి కూడా సంకేతాలు పంపుతున్న ఆయన.. మరో వైపు సొంత పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రభావం చూపిస్తానని అదే సొంత పార్టీ పెట్టుకుంటే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో దున్ని పారేస్తానని ఆయన లెక్కలేసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రయత్నాలు కూడా ప్రారంభించేశారని చెబుతున్నారు.

టీఆర్ఎస్ అని వచ్చేలా.. “తెలంగాణ రైతు సమితి” అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం సీఈసీకి దరఖాస్తు చేసినట్లుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పొంగులేటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించి వారి కోసం రాజకీయం చేస్తున్నారు . ప్రచారం ప్రారంభించారు. ఏ పార్టీలో చేరిన వారంతా ఆ పార్టీ అభ్యర్థులని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ గురించి బయటపెడుతున్నారు. సొంత పార్టీ అనేది అంతర్గగతంగా జరుగుతున్న వ్యవహారం అని… కొంత కాలంగా ప్రచారం జరుగుతోదంది.

పొంగులేటితో పాటు మరో ఇద్దరు మాజీ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ పెట్టాలని పొంగులేటి సిద్దమయ్యారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి పెట్టేలా.. ఆ పార్టీని ఓడించడానికి ప్రత్యేక ప్లాన్ ఉందని కూడా చెబుతున్నారు. పొంగులేటికి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. ఎన్నికలు ఎలా అయినా చేయగలరు. అందుకే ఆయన కొత్త పార్టీ పెట్టవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close