కొంగకలాన్ దగ్గరే ఫాక్స్ కాన్ ప్లాంట్ !

ఫాక్స్ కాన్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోకుండానే కొన్ని ప్రభుత్వాలు ప్రకటించుకున్నట్లుగా ఇంగ్లిష్ మీడియా రిపోర్ట్ చేయండతో గందరగోళం ఏర్పడింది. అంతకు ముందే..తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫాక్స్ కాన్ ప్లాంట్ తెలంగాణలో పెడుతున్నారని ప్రకటించింది. ఈ గందరగోళం గురించితెలియగానే.. ఫాక్స్‌కాన్ పరిశ్రమను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తాము కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరారు. అంతేకాక, తైవాన్‌లో పర్యటించాలని యాంగ్ లియూ కేసీఆర్‌ను ఆహ్వానించారు.

మార్చి రెండో తేదీన ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. హైద‌రాబాద్‌లో త‌మ టీమ్ విజిట్ చేసిన‌ప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖలో థ్యాంక్స్ తెలిపారు. హైద‌రాబాద్‌లో బ‌స చేసిన స‌మ‌యం అద్భుతంగా సాగింద‌న్నారు. ఇండియాలో త‌న‌కు ఓ కొత్త ఫ్రెండ్ దొరికిన‌ట్లు లియూ త‌న లేఖ‌లో చెప్పారు. భ‌విష్య‌త్తులోనూ కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేసేంద‌కు ఉత్సాహాంగా ఉన్న‌ట్లు తెలిపారు.

మార్చి 2వ తేదీన చ‌ర్చించిన‌ట్లే.. కొంగ‌ర క‌లాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చైర్మెన్ లియూ త‌న లేఖ‌లో తెలిపారు. వీలైనంత త్వ‌ర‌గా మాన్యుఫ్యాక్చ‌రింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మీ టీమ్ స‌హ‌కారాన్ని కోర‌నున్న‌ట్లు చెప్పారు. కొంగ‌ర‌క‌లాన్‌లో ఏర్పాటు చేయ‌బోయే ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్‌ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close