తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.. ఉచితంగా చేయాలని ప్రైవేటు ఆస్పత్రులకు దిశానిర్దేశంమ చేస్తోంది. ముందుగా మూడు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రులను.. ఈ దిశగా.. ఉచిత చికిత్స ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌, మమతా మెడికల్ కాలేజ్‌, కామినేని మెడికల్ కాలేజీల్లో మొదట కరోనా టెస్ట్‌లు, కరోనా చికిత్సలు ఉచితంగా అందించనున్నారు.

ముందు ముందు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతోపాటు.. కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా.. ఈ ఉచిత కరోనా టెస్టులు, చికిత్స విధానాన్ని విస్తరించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ ఉచిత టెస్టులు, చికిత్స విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ సర్కార్.. కరోనా విషయంలో… పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తోందని.. హైకోర్టు తీవ్రంగా మండిపడిన తర్వాతి రోజే… ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సరైన కరోనా వైద్యం అందడం లేదంటూ.. హైకోర్టులో అదే పనిగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. టెస్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అదే సమయంలో.. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. హోం ఐసోలేషన్ అంటూ.. ఇంటికే పంపించేస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరదామనుకునేవారికి అవకాశం దక్కడం లేదు. ఏ ఆస్పత్రి చేర్చుకోవడం లేదు. బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వీఐపీలు వస్తే క్షణాల్లో వారిని చేర్చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపై… తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కదిలింది. అయితే.. ప్రకటనలకే కాకుండా… సీరియస్‌గా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. టెస్టులు, చికిత్స ఉచితంగా అందేలా చూడాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి ఎక్కువగా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close