ఫెయిలైన విద్యార్థులంద‌రికీ ఫ్రీ రీవెరిఫికేష‌న్‌

తెలంగాణ‌లో వివాదాస్ప‌దంగా మారిన ఇంట‌ర్ ఫ‌లితాల తీరుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డితోపాటు కార్య‌ద‌ర్శుల‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంట‌ర్ లో ఫెయిలైన విద్యార్థిలంద‌రి పేప‌ర్ల‌ను ఉచితంగా రీవెరిఫికేష‌న్ చేయాల‌ని బోర్డుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రీవేల్యూయేష‌న్, రీకౌంటింగ్ ఈ రెండు ఉచితంగానే జ‌రగాల‌ని అధికారుల‌కు సీఎం చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నీ, అడ్వాన్స్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ను వీలైనంత త్వ‌ర‌గా నిర్వ‌హించాల‌నీ, విద్యార్థులు విద్యాసంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా చూడాల‌ని సీఎం అన్నారు. రీవేల్యూయేష‌న్‌, రీ వెరిఫికేష‌న్లతోపాటు స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జనార్థ‌న్ కు ముఖ్య‌మంత్రి అప్ప‌గించారు.

ఇంట‌ర్ బోర్డులో త‌లెత్తిన వివాదంపై ముఖ్య‌మంత్రి స్పందిస్తూ… ఈ వివాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంలో సీఎం మాట్లాడుతూ… ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను పూర్తిగా ఒక స్వ‌తంత్ర సంస్థ‌కు ఇస్తే ఎలా ఉంటుంద‌నీ, వివాదాల‌కు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఈ వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేయాల్సి ఉంద‌ని అన్నారు. ఇంట‌ర్ బోర్డులో గ‌త కొన్నాళ్లుగా వివాదాలు న‌డుస్తున్నాయ‌న్న అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చార‌నీ, ఈ సంద‌ర్భం ఆయ‌న వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి తాజాగా ప్ర‌క‌టించిన నిర్ణ‌యంతో దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు కొంత ఊర‌ట ల‌భించిన‌ట్టే. అయితే, ఫ‌లితాలు వెలువ‌డ్డ త‌రువాతి నుంచీ రీవేల్యుయేష‌న్ కోసం ఇప్ప‌టికే చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లించారు. స‌బ్జెట్ కి రూ. 600 చొప్పున చాలామంది క‌ట్టారు. వీరు చెల్లించిన ఫీజుల్ని వాప‌సు ఇస్తారో లేదో ఇంకా స్ప‌ష్టంగా అధికారులు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది. ఉచిత రీవెరిఫికేష‌న్ తో విద్యార్థుల‌కు కొంత ఊర‌ట‌. అయితే, ఈ గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు క‌ఠినంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కి కేవ‌లం ఉచిత రీవెరిఫికేష‌ర్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close