చిరంజీవితో దాసరి కత్తి ఫైటింగ్?

సినీ రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, రాజకీయాలలోకి వెళ్లి ఇబ్బందిపడుతున్న చిరంజీవి మళ్ళీ పోగొట్టుకొన్న చోటునే ఉంగరం వెతుకొనే ప్రయత్నంలో సినీ పరిశ్రమకి తిరిగి వచ్చేరు. ఆయన చేయబోయేది 150వ సినిమా కావడంతో దానిపై అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఆ సినిమా గురించి ఆయన కూడా కొంచెం అతిగా అభిమానులను ఊరించడం చేత దానిపై వారిలో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఓ ఆర్నెల్లు ఓ దర్శకుడితో కధా చర్చాల పేరిట పట్లు పట్టినా ఫలితం లేకపోవడంతో, ఎప్పుడూ కొంచెం సేఫ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడే చిరంజీవి తమిళ కత్తిని పట్టుకొన్నారు. అంటే తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు. అందుకు అభిమానులు, రామ్ గోపాల్ వర్మ వంటి మెగాభిమానులు కూడా చాలా హర్ట్ అయ్యారు కూడా. ‘తెలుగులో కధలే దొరకలేదా..రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారు?’ అని చిరంజీవి విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది.

అయినా ఆయన ఎత్తిన కత్తిని దించలేదు…అయినా ఆయనపై 150వ సినిమా ఒత్తిడి తగ్గలేదు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోతాననే భయం వలనేనేమో, ఆ ‘150వ గండం’ గట్టెక్కేయాలని తన కొడుకు రామ్ చరణ్ తేజ్ చేసిన ‘బ్రూస్లీ’ సినిమాలో చిన్న అతిధి పాత్రలో నటించేసి ‘మమ’ అనిపించేసారు. కానీ ఆ బ్రూస్లీ కూడా చతికిలపడటంతో మళ్ళీ కధ మొదటికి వచ్చినట్లయింది. మళ్ళీ ఆయనపై ఒత్తిడి పెరిగిపోయింది. దానితో ఇక ఆ తమిళ కత్తినే గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవడానికి ఫిక్స్ అయిపోయారు.

ఆ సినిమా షూటింగ్ కి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈలోగానే దాసరి నారాయణ రావు కూడా మరో కత్తి పట్టుకొని వచ్చి సవాలు విసురుతున్నారు. “ఆ కత్తినాదే..దానిపై సర్వ హక్కులు నాకే ఉంటాయి..కనుక ఎవరూ నా అనుమతి లేకుండా నా కత్తిని వాడుకోకూడదు,” అని ఆ కత్తి అసలు యజమాని అంటే కత్తి సినిమా కధా రచయిత ఎన్. నరసింహ రావు కత్తి ఫైట్ చేస్తున్నారు. సినిమా కధా హక్కుల వేదికకి అధ్యక్షుడుగా ఉన్న దాసరి వద్దకి ఆ కత్తి పంచాయితీ రావడంతో, ఆయన “నీ కత్తికి నా కత్తి అడ్డం వేస్తాను” అని అభయ హస్తం ఇచ్చి, చిరంజీవితో కత్తి ఫైట్ కి సిద్దమయిపోయారు. “ముందు మా కత్తికి న్యాయం చేసిన తరువాతనే మీ కత్తి తిప్పుకోమని” సూచించారు. ఒకవేళ కాదని మొండిగా కత్తి తిప్పదలిస్తే దర్శకుల సంఘం (అందులో మెగా కత్తికి దర్శకత్వం వహించబోతున్న వివి.వినాయక్ కూడా ఉంటారు), సినీ కార్మికుల సంఘాలు సహాయ నిరాకరణ చేస్తాయని హెచ్చరించారు. అంటే దాసరి మెగాస్టార్ తో డైరెక్ట్ కత్తి ఫైట్ కి సిద్దం అయిపోయినట్లే భావించవచ్చును. మరి వారు మొదలుపెట్టబోతున్న ఈ కత్తి యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఎందుకంటే ఇద్దరికీ అందులో మంచి నైపుణ్యం, అనుభవం, వెనుక బలమయిన సైన్యాలు ఉన్నాయి కదా అందుకే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close