అభివృద్ధి కోసం కాక అభివృద్ధి సూచికల కోసం పోరాటమా? హవ్వ!

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల మధ్య గొడవలకి అంతే కనబడటం లేదు. ఎంతో భాద్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు చంటి పిల్లలలాగ, ఆగర్భ శత్రువులలాగ కీచులాడుకొంటున్నాయి. పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధిలో పోటీపడవలసిన ప్రభుత్వాలు, ర్యాంకుల కోసం పోటీ పడుతూ కీచులాడుకొంటున్నాయి. రెండు ప్రభుత్వాల మద్య తాజాగా మరో వివాదం మొదలై మళ్ళీ కేంద్రానికి, పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేసుకొనే వరకు వెళ్ళింది. యధాప్రకారం మళ్ళీ రెండు ప్రభుత్వాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకొంటున్నారు.

ఈసారి అవి దేనికి పోరాడుకొంటున్నాయో చూస్తే ప్రజలు కూడా నవ్వుకోకుండా ఉండలేరు. ప్రపంచ దేశాలలో వ్యాపారానికి అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకి ప్రపంచ బ్యాంక్ ప్రతీ ఏటా ర్యాంకులు ఇస్తుంటుంది. గత ఏడాది మన దేశంలో గుజరాత్ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ రాగా, ఆంధ్రప్రదేశ్ కి రెండవ ర్యాంక్, తెలంగాణాకి 13వ ర్యాంక్ వచ్చింది. ఈ ఏడాది తన ర్యాంకింగ్ ని మెరుగుపరుచుకోవడం కోసం తెలంగాణా ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకి నివేదికలు సమర్పిస్తుంటాయి. ఆ నివేదికల ఆధారంగా సదరు శాఖా వెబ్ సైట్ లో ఏ ఏ రాష్ట్రాలకి ఎంత ర్యాంకులో ఉన్నాయనే విషయం కనబడుతుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రధమ స్థానంలో, ఆ తరువాత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నాయి.
తమ ప్రభుత్వం కేంద్రానికి సమర్పిస్తున్న నివేదికలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యధాతధంగా కాపీ కొట్టి వాటినే తమవిగా చెప్పుకొంటూ కేంద్రానికి సమర్పిస్తోందని తెలంగాణా ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి ఒక లేఖ ద్వారా పిర్యాదు చేసారు. తమ ప్రభుత్వం సమర్పిస్తున్న వాటిలో ఉన్న కొన్ని అచ్చు తప్పులని యధాతధంగా కాపీ కొట్టి వాటినే కేంద్రానికి సమర్పిస్తోందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ రైట్స్ ఉల్లంఘనకి పాల్పడిందని ఆరోపిస్తూ తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఒక పిర్యాదు కూడా చేసింది.

తెలంగాణా ప్రభుత్వ ఆరోపణలని ఏపి ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ కొట్టిపడేశారు. “ఇది మాపై బురద జల్లడంగానే భావిస్తున్నాము. పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించేందుకు మా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసింది. మా ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక విధానాలని యావత్ దేశమే కాదు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా గుర్తించింది. అందుకే గత ఏడాది మా రాష్ట్రానికి దేశంలో రెండవ స్థానం దక్కింది. ఈసారి మా స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో “లీ కువాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆఫ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్” తో ఒప్పందం చేసుకొని దాని సూచనలు, సలహాలతో మా విధానాలలో ఎప్పటికప్పుడు గణనీయమైన మార్పులు చేసుకొంటున్నాము. కనుక మా నివేదికలని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తి పొందుతుంటే మాకు ఇతర ప్రభుత్వాల నివేదికాలని కాపీ కొత్తవలసిన ఆగత్యమే లేదు,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close