ఈ ఎన్నిక‌ల్లో బోల్డంత ‘కామెడీ’

తెలుగు సినిమాల్లో ఈమ‌ధ్య కామెడీ బాగా త‌గ్గిపోయిందండీ..

– మ‌రేం ఫ‌ర్వాలేదు. ఈ ఎన్నిక‌ల‌లో బోల్డంత లైవ్ కామెడీ చూడొచ్చు.

అవును. ఈసారి ఎన్నిక‌ల‌లో క‌మెడియ‌న్లు మైకులు ప‌ట్టుకుని దంచి కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంచు మించుగా ప్ర‌తీ పార్టీలోనూ హాస్య‌న‌టుల హంగామా క‌నిపించ‌బోతోంది. అలీ, పోసాని, నాగ‌బాబు, ఫృథ్వీ, ష‌ల‌క‌ల శంక‌ర్‌, కృష్ఱుడు… ఇలా పేరెన్న‌ద‌గిన హాస్య‌న‌టులు త‌మ పార్టీల త‌ర‌పున ప్ర‌చారం చేయ‌బోతున్నారు. అలీ గుంటూరు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డాడు. జ‌గ‌న్ ఇది వ‌ర‌కే… ఆ సీటుపై మాట ఇచ్చేయ‌డం వ‌ల్ల అలీ ఈసారి ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం లేదు. కేవ‌లం ప్ర‌చారానికే ప‌రిమితం. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండే చోట అలీతో ప్ర‌చారం చేసి లాభ‌ప‌డాల‌ని వైకాపా భావిస్తోంది. అలీ కంటే ముందు పోసాని, ఫృథ్వీ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పోసాని ఏం మాట్లాడినా సెటైరిక‌ల్‌గానే ఉంటుంది. స్పీచుల్లో ఆయ‌న్ని మించినోడు లేడు. ఇక ఫృథ్వీ ఈమ‌ధ్య ఫైర్ బ్రాండ్‌గా మారిపోయాడు. ఎవ‌రినైనా స‌రే ఉతికి ఆరేస్తున్నాడు.

జ‌న‌సేన త‌ర‌పునా కొంత‌మంది క‌మెడియ‌న్లు ప్ర‌చారం చేయ‌బోతున్నార‌ని టాక్‌. నాగ‌బాబు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని టీడీపీపై సెటైర్లు వేస్తున్నాడు. ష‌క‌ల‌క శంక‌ర్ కూడా శ్రీ‌కాకుళం ఏరియాలో ప్ర‌చారం చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. ప‌వ‌న్ అంటే ఇష్టంతో కొంత‌మంది హాస్య‌న‌టులు.. జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఎటొచ్చీ.. క‌మెడియ‌న్ల హంగామా లేని పార్టీ టీడీపీనే. ఒక‌ప్పుడు ఏవీఎస్ లాంటి హాస్య న‌టులు టీడీపీకి ప్ర‌చారం చేసి పెట్టారు. ఇప్పుడు మాత్రం ఆలోటు స్పష్టంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close