గంటా గురి సీఎం సీటు పైనా? అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయం లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా మెలిగిన అవంతి శ్రీనివాస్ , గంటా కు సంబంధించిన పలు సీక్రెట్స్ రివీల్ చేశారు. అసలు గంటా శ్రీనివాసరావు టార్గెట్ సీఎం సీటు పైనే అంటూ, లోకేష్ అప్రమత్తంగా ఉండాలంటూ , వాడి వేడి విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..

అవంతి శ్రీనివాస్ వర్సెస్ గంటా శ్రీనివాస్ :

అవంతి శ్రీనివాసరావు కు జగన్మోహనరెడ్డి భీమిలి టికెట్ కన్ఫామ్ చేయడంతో ఆయన టీడీపీ ని వదిలి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2009 నుండి 2014 మధ్యలో భీమిలి ఎమ్మెల్యే గా పనిచేసిన ఈయన ఇప్పుడు మరొక సారి భీమిలి నుండి పోటీ చేయాలని భావించి టిడిపిని అడిగినప్పటికీ టిడిపిలో సరైన స్పందన రాకపోవడంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ టిడిపిని వీడిన తర్వాత, ఆయనను లక్ష్యంగా చేసుకుని గంటా శ్రీనివాసరావు పలు విమర్శలు గుప్పించారు. ఈబిసి రిజర్వేషన్ల సందర్భంగా చంద్రబాబును అభినందిస్తూ పాలాభిషేకం చేసిన పాల తడి కూడా చేతి నుండి ఆరకుండానే అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరిపోయారని, ఒకవేళ భీమిలి సీటు కోసమే అవంతి శ్రీనివాస్ పార్టీ మారి ఉంటే భీమిలి సీటు వదులుకోవడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. అవంతి శ్రీనివాస్ కు వ్యక్తి గత విలువలు లేవని గంట శ్రీనివాస్ విమర్శించారు.

గంటా శ్రీనివాసరావు ది నమ్మక ద్రోహం చేసే నైజం:

అయితే ఈ విమర్శలన్నింటిమీద ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ధీటుగా స్పందించారు. అసలు 2014లో తనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళింది గంటా శ్రీనివాసరావేనని, తనతో పాటు కన్నబాబు రాజు, రమేష్ తదితర ఐదుగురు లీడర్లను గంటా శ్రీనివాస్ బాబు వద్దకు తీసుకెళ్లారని, ఐదు మందికి ఎమ్మెల్యే టికెట్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చి తీసుకెళ్లారని, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఎమ్మెల్యే టికెట్ కు బదులుగా ఎంపీ టికెట్ ఇప్పించారని, అలాగే ఆ ఐదుగురిలో ఇద్దరికీ ఏ టికెట్ ఇవ్వకుండా వదిలివేశారని, తనకు మాత్రం మంత్రి పదవి తెచ్చుకున్నారని అన్నారు. ఆ రకంగా, నమ్మక ద్రోహం చేయడం గంటా శ్రీనివాసరావు నైజం అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాస రావు నమ్మక ద్రోహం నైజం గురించి తెలియాలంటే ఆయన్ని మొదట్లో ఆదరించిన అయ్యన్న పాత్రుని అడిగినా, లేదంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగినా, లేదంటే చిరంజీవిని అడిగినా చెబుతారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

గంటా గురి సీఎం సీటు పైనే:

అదేవిధంగా చంద్రబాబు నాయుడు తన రోల్ మోడల్ అని గంటా శ్రీనివాసరావు గతంలో పలుమార్లు చెప్పారని గుర్తు చేసిన అవంతి శ్రీనివాస్, చంద్రబాబుని రోల్ మోడల్ గా తీసుకుని తాను కూడా వెన్నుపోటు మార్గంలో ముఖ్యమంత్రి కావాలనేది గంటా శ్రీనివాసరావు ఆశయం అని వ్యాఖ్యానించి బాంబు పేల్చారు అవంతి శ్రీనివాస్. గతంలో ఒక ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు తనకు రోల్ మోడల్ అని గంటా శ్రీనివాసరావు చెప్పిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాసరావుకు ఇద్దరు వియ్యంకులు ఉన్నారని ఒకరేమో భీమవరం ఎమ్మెల్యే గా ఉన్నారని మరొక వియ్యంకులు అయినటువంటి నారాయణ మంత్రి గా ఉన్నారని, అదే గంటా శ్రీనివాసరావు గారి ధైర్యం అని, అసలు ఆయన లక్ష్యం భీమిలి కాదని, ఆయన అసలు లక్ష్యం అమరావతే నని, అంటే ముఖ్యమంత్రి పదవే నని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏనాటికైనా గంట శ్రీనివాస్ వెన్నుపోటు పొడుస్తాడు అని, కాబట్టి లోకేష్ జాగ్రత్తగా ఉండాలని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

మొత్తం మీద గంటా శ్రీనివాసరావు , అవంతి శ్రీనివాస్ ల మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరి రహస్యాలు మరొకరు బయట పెట్టుకోవడం కూడా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరిద్దరి మాటల యుద్ధం కారణంగా ఇద్దరు నాయకుల స్వరూపాలు తెలుసుకునే అవకాశం ప్రజల కు కలిగింది

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close