గంటా మ‌న‌సులో అస‌లు మాట ఇద‌న్న‌మాట‌..!

రెండురోజుల‌పాటు తెలుగుదేశం పార్టీ స‌మీక్ష స‌మావేశం విశాఖప‌ట్నంలో చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీ‌నివాస‌రావు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు! ఆయ‌న రాక‌ను కాస్త ప్ర‌త్యేకంగానే అంద‌రూ చూస్తున్న ప‌రిస్థితి! ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ఏమంత యాక్టివ్ గా లేరు. ఒక‌టీ అర కార్య‌క్ర‌మాల్లో తప్ప‌… పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎక్కువ‌గా ఇంటికే ప‌రిమితం అవుతూ వ‌స్తున్నారు. అంతేకాదు, ఆయ‌న టీడీపీని వీడ‌బోతున్నారూ, వైకాపాలోకి వెళ్తార‌ని, లేదు భాజ‌పాలో లైన్ క్లియ‌ర్ చేసుకున్నారంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇప్పుడాయన‌ పార్టీ ఆఫీస్ కి రావ‌డంతో అన్నీ ప‌క్క‌కి వెళ్లిపోయాయి. దీంతో పార్టీ మార్పుపై ఆయ‌న మ‌న‌సు మార్చుకున్నారా, టీడీపీలోనే కొన‌సాగాల‌ని అనుకుంటున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది.

ఇంత‌కీ, సొంత పార్టీ మీద ఆయ‌న‌లో అసంతృప్తి ఏదైనా ఉందా..? ఏదో ఒక‌టి లేక‌పోతే పార్టీ నుంచి బ‌య‌ట‌కి వెళ్తారంటూ ఎందుకు క‌థ‌నాలు వ‌స్తాయి? అలాంటిదేదీ లేక‌పోతే కాసేపు వైకాపాలోకి వెళ్తార‌నీ, భాజ‌పావైపు చూస్తున్నారంటూ మైండ్ గేమ్ ఎందుకు న‌డిచిన‌ట్టు..? ఇదే అంశ‌మై ఆఫ్ ద రికార్డ్ గంటా కొంత‌మందితో చెబుతూ వ‌స్తున్న విష‌యం ఏంటంటే… పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని అన్న‌ట్టుగా స‌మాచారం! టీడీపీ ఇప్పుడు అధికారంలో లేదు క‌దా, ఇప్పుడు కూడా ప్రాధాన్య‌త అంటే ఇంకా ఏమివ్వాలని గంటా కోరుకుంటున్న‌ట్టు..? ప్ర‌తిప‌క్ష పార్టీగా ఏదైనా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలోగానీ, ఇత‌ర అంశాల‌పైగానీ త‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌న్న‌ది గంటా అసంతృప్తిగా తెలుస్తోంది!

టీడీపీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 100 రోజులు పూర్త‌యినా కూడా త‌న‌కు చంద్ర‌బాబు ఒక్క‌సారి కూడా ఇంత‌వ‌ర‌కూ ఫోన్ చేసిన సంద‌ర్భం లేద‌న్న‌ది గంటా అభిప్రాయమంటూ స‌న్నిహితులు చెబుతున్నారు. అంటే, పార్టీలో ఆయ‌న కీల‌క స్థానం ఆశిస్తున్న ప‌రిస్థితి ఉంద‌న్న‌ట్టుగా ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇప్పుడు విశాఖ‌కు చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చారు కాబ‌ట్టి, పార్టీ అధ్య‌క్షుడిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వాల‌నే వ‌చ్చారుగానీ… గంటాలో ఆ అసంతృప్తి అలానే ఉంద‌ట‌! అంటే, పార్టీ మార్పున‌కు సంబంధించిన చ‌ర్చ‌కు ఇంకా త‌లుపులు తెరిచే ఉంచార‌నీ భావించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close