గౌత‌మి పుత్ర స్పెష‌ల్ షో.. అమ‌రావ‌తిలో?

జ‌న‌వ‌రి 12న గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి విడుద‌ల‌కు అన్ని ఏర్పాట్లూ జ‌రిగిపోతున్నాయి. జ‌న‌వ‌రి 5న సెన్సార్ పూర్తికాబోతోంది. ఆ త‌ర‌వాత ప్రిమియ‌ర్ల హ‌డావుడి మొద‌లైపోతుంది. ఓవ‌ర్సీస్‌లో 11న ప్రీమియ‌ర్లు ప‌డ‌బోతున్నాయి. అంత‌కంటే ముందు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి స్పెష‌ల్ షో వేయాల‌ని ఎదురుచూస్తోంది చిత్ర‌బృందం. ఇద్ద‌రు సీమ్ ల‌కూ ఓకేసారి షో వేయాల‌ని భావిస్తున్నా… అది కుదిరే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. అందుకే సీఎమ్‌లు ఇద్ద‌రికీ వేర్వేరుగా వాళ్ల‌కు వెసులు బాటు ఉన్న స‌మ‌యాల్లో గౌత‌మి పుత్ర‌ని ప్ర‌ద‌ర్శించాల‌ని డిసైడ్ అయ్యారు.

చంద్ర‌బాబుకి మాత్రం అమ‌రావ‌తిలో షో వేయ‌బోతున్నార‌ని తెలిసింది. అమ‌రావ‌తిలో త‌న‌కు సినిమా చూపించ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా చిత్ర‌బృందాన్ని కోర‌డంతో క్రిష్ అండ్ టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. అయితే టైమ్‌, డేట్ అన్న‌ది చంద్ర‌బాబునే డిసైడ్ చేసి చెప్పాల్సివుంది. బ‌హుశా 10వ తారీఖున చంద్ర‌బాబు ఈ సినిమా చూసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంత‌కంటే ముందు కేసీఆర్‌కి చూపిస్తారా, లేదంటే బాబు చూశాక చూస్తారా అన్న‌ది తెలియాల్సివుంది. తెలంగాణ‌లో ఫ్యాన్స్ షోలు వేయాలా, వ‌ద్దా అనే విష‌యంపై కూడా చిత్ర‌బృందం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close